Home న్యూస్ 3 డేస్ డిమోంటి కాలనీ2 కలెక్షన్స్….వీకెండ్ లో బానే వచ్చాయి!

3 డేస్ డిమోంటి కాలనీ2 కలెక్షన్స్….వీకెండ్ లో బానే వచ్చాయి!

0
Demonte Colony2 Telugu 3 Days Box Office Collections
Demonte Colony2 Telugu 3 Days Box Office Collections

ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు తమిళ్ లో రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డిమోంటి కాలనీ 2(Demonte Colony2 Telugu 3 Days Collections) సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా, తెలుగులో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసింది.

2 రోజులు పూర్తి అయ్యే టైంకి 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా మూడో రోజు ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో కొంచం డ్రాప్స్ ను సొంతం చేసుకుని…

12 వేల లోపు టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో మాత్రం పర్వాలేదు అనిపించినా సినిమా ఓవరాల్ గా మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా మరోసారి బాగానే హోల్డ్ చేసింది.

ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా ఇప్పుడు 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని ఇక్కడ దక్కించుకుని బాగానే హోల్డ్ చేయగా షేర్ అటూ ఇటూగా 1.15 కోట్ల రేంజ్ లో ఉందని అంచనా ట్రేడ్ వర్గాల అంచనా…ఓవరాల్ గా వీకెండ్ ని పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసిన సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది…సినిమా వీకెండ్ లో ఓవరాల్ గా బాగానే పెర్ఫార్మ్ చేయగా ఇక వర్కింగ్ డేస్ లో ఎలాంటి హోల్డ్ ని చూపించి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here