Home న్యూస్ సరిపోదా శనివారం బుకింగ్స్ కి ఎదురుదెబ్బ పడిందిగా!!

సరిపోదా శనివారం బుకింగ్స్ కి ఎదురుదెబ్బ పడిందిగా!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో గురువారం రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా నాని కెరీర్ లో కొంత గ్యాప్ తర్వాత మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమా అవ్వడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉండగా…

సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా ఆన్ని చోట్లా బుకింగ్స్ మంచి జోరునే చూపెడుతూ ఉండగా సడెన్ గా సినిమా బుకింగ్స్ పై ఇంపాక్ట్ పడింది…థియేటర్స్ లో మేజర్ చెయిన్ అయిన PVR/INOX థియేటర్స్ చెయిన్ లో కొన్ని చోట్ల బుకింగ్స్ ను ఓపెన్ చేయగా…

బుకింగ్స్ లో మంచి జోరు కనబడుతూ ఉండగా సడెన్ గా సినిమా బుకింగ్స్ ఇక బ్రేక్ పడింది….అలాగే PVR/INOX థియేటర్స్ చెయిన్ లో సినిమాకి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కాన్సిల్ అయ్యింది…దాంతో సినిమా ఓవరాల్ అడ్వాన్స్ బుకింగ్స్ పై ఈ ఇంపాక్ట్ గట్టిగానే పడింది….

కారణాలు క్లియర్ గా చెప్పకపోయినా కూడా PVR/INOX థియేటర్స్ చెయిన్ లో వర్కింగ్ డేస్ లో టికెట్ ఆఫర్స్ ని అప్పుడప్పుడు పెడతారు…దాంతో చాలా మంది ఆ ఆఫర్స్ తోనే సినిమాను బుక్ చేయడంతో వర్కింగ్ డే లో రిలీజ్ వలన టికెట్ కాస్ట్ తగ్గడం వలన…

ఫ్రెష్ గా బుకింగ్స్ ను ఓపెన్ చేయడానికి PVR/INOX థియేటర్స్ చెయిన్ వాళ్ళు బుకింగ్స్ ను ఆపేసినట్లు ఒక వార్తా రాగా మరో పక్క డిస్ట్రిబ్యూషన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ వలన బుకింగ్స్ ఆగాయని అంటున్నారు…ఏది ఏమైనా ఈ పాటికి సాలిడ్ బుకింగ్స్ తో కుమ్మేయాల్సిన సరిపోదా శనివారం మూవీ…

PVR/INOX థియేటర్స్ చెయిన్ లో బుకింగ్స్ ఓపెన్ చేయకపోవడంతో ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయా అని అందరూ ఎదురు చూస్తున్నారు, మేకర్స్ త్వరగా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేసే పనిలో ఉండగా కొన్ని గంటల్లో అన్నీ సద్దుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here