Home న్యూస్ 1st డే సరిపోదా శనివారం ఓపెనింగ్స్….కుమ్ముడు మొదలు పెట్టిన నాచురల్ స్టార్!

1st డే సరిపోదా శనివారం ఓపెనింగ్స్….కుమ్ముడు మొదలు పెట్టిన నాచురల్ స్టార్!

0
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Box Office Collections Openings
SARIPODHAA SANIVAARAM Movie 1st Day Box Office Collections Openings

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) భారీ లెవల్ లో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది…ఆల్ రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా దుమ్ము లేపుతున్న సినిమా ప్రీమియర్ షోలకి కలెక్షన్స్ పరంగా…

ఎక్స్ లెంట్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ కూడా షో షోకి సాలిడ్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం…సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దసరా మూవీతో పోల్చితే తక్కువగానే ఉన్నా కూడా సినిమాకి ఆడియన్స్ నుండి…

రెస్పాన్స్ బాగానే ఉండటంతో షో షోకి కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేయడం స్టార్ట్ చేసిన సరిపోదా శనివారం నాని మాస్ రాంపెజ్ ను చూపెడుతుంది… మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…

ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుండి షో షోకి కలెక్షన్స్ ఈవినింగ్ అండ్ నైట్ షోలకి పెరిగితే వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది, మొత్తం మీద అన్నీ అనుకున్నట్లు జరిగి సినిమా అంచనాలను మించిపొతే 6-8 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను అందుకోవచ్చు.

మొత్తం మీద నాని మరోసారి తన మాస్ పవర్ ను చూపెడుతూ ఉండటంతో ఈ రేంజ్ ను సినిమా నైట్ షోల టైంకి అందుకునే అవకాశం ఉంది. ఇక ఇంతకుమించి జోరు చూపాలి అంటే ట్రెండ్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర డే ఎండ్ టైం కి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here