బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని మొదలు పెట్టడం వరుస విజయాలతో మొదలు పెట్టి, మంచి ప్రామిసింగ్ హిరోలా ఎదుగుతున్న టైంలో వరుస పెట్టి నిరాశ కలిగించే సబ్జెక్ట్ లను ఎంచుకుని కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోగా అప్పుడప్పుడు తన కొత్త సినిమాలతో వస్తున్నా కూడా ఆడియన్స్ అసలు రాజ్ తరుణ్(Raj Tharun) మూవీస్ ను…
పట్టించు కోవడం పూర్తిగా మానేశారు…రీసెంట్ గా వారం గ్యాప్ లో రాజ్ తరుణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి…“పురుషోత్తముడు” అంటూ ఒక వారం మరో వారంలో తిరగబడర సామీ(Tiragabadara saami Total Collections) అంటూ మరో సినిమాగా రాగా…
ఈ సినిమాను కూడా ఆడియన్స్ అసలు ఏమాత్రం పట్టించు కోలేదు… బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఆటకే ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకోగా ఏ దశలో కూడా ఇక తేరుకోలేక పోయింది. సినిమాను మొత్తం మీద 4 కోట్ల రేంజ్ లో బడ్జెట్ లో నిర్మించారు అన్న టాక్ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
ఓపెనింగ్ వీకెండ్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా అతి కష్టం మీద 25 లక్షల షేర్ ని అందుకోగా మిగిలిన రన్ లో మొత్తం మీద 45 లక్షల రేంజ్ లో షేర్ ని కోటి రేంజ్ లో గ్రాస్ ను మాత్రమే సొంతం చేసుకుని రన్ ని పూర్తి చేసుకుని రాజ్ తరుణ్ ఖాతాలో మరో డిసాస్టర్ గా నిలిచింది…
బాక్ టు బాక్ వారం గ్యాప్ లో 2 సినిమాలతో వచ్చినా కూడా ఏమాత్రం ఆకట్టుకోలేక పోయిన రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా పడిపోయింది. ఏదైనా క్రేజీ కాంబో తో వస్తే తప్పితే ఇక రాజ్ తరుణ్ తేరుకునే అవకాశాలు అయితే చాలా తక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు…