Home న్యూస్ సరిపోదా శనివారం నైజాం డే 1 కలెక్షన్స్…ఇలా జరిగింది ఏంటి!

సరిపోదా శనివారం నైజాం డే 1 కలెక్షన్స్…ఇలా జరిగింది ఏంటి!

0
SARIPODHAA SANIVAARAM movie 1st Day Nizam Collections
SARIPODHAA SANIVAARAM movie 1st Day Nizam Collections

భారీ అంచనాల నడుమ ఆగస్టు లాస్ట్ వీకెండ్ లో మంచి సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా, మంచి టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఇక కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది అని అనుకున్నారు అందరూ..

బుకింగ్స్ లో మంచి ట్రెండ్ కొనసాగించిన సినిమా ఓవరాల్ గా మొదటి రోజు కన్నా ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ కొంచం వీక్ గానే ఉన్నా ఓవరాల్ గా మొదటి రోజు పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ లో జోరు చూపించింది…కానీ సినిమాకి వచ్చిన టాక్ కి ఇంకా బెటర్ గా జోరు చూపించి ఉండాల్సింది…

మొత్తం మీద నైజాం ఏరియాలో మొదటి రోజు బిగ్ సోలో రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా డీసెంట్ ఓపెనింగ్స్ నే సొంతం చేసుకుంది….మొదటి రోజు మొత్తం మీద 2.75 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను ఇక్కడ సొంతం చేసుకుని పర్వాలేదు అనిపించింది.

నాని నటించిన లాస్ట్ ఇయర్ మూవీస్ దసరా 6.78 కోట్ల షేర్ ని అందుకుంటే, హాయ్ నాన్న మూవీ 1.64 కోట్ల షేర్ ని సాధించింది…ఇక ఈ ఇయర్ వచ్చిన మీడియం బడ్జెట్ మూవీస్ లో పోటిలో రిలీజ్ అయిన హనుమాన్ మూవీ 3.66 కోట్ల షేర్ ని అందుకోగా సమ్మర్ లో వచ్చిన…

టిల్లు స్క్వేర్ మూవీ 4.35 కోట్ల షేర్ ని అందుకుంది….అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ది ఫ్యామిలీ స్టార్ 1.78 కోట్ల షేర్ ని, డబుల్ ఇస్మార్ట్ 2.49 కోట్ల షేర్ ని అందుకున్నాయి. కానీ బెటర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సరిపోదా శనివారం ఇంకా బెటర్ గా ఓపెన్ అవ్వాల్సింది…

కానీ నైట్ షోలకు నైజాంలో వర్షాలు కొంచం ఇబ్బంది పెట్టాయి…ఆ ఇంపాక్ట్ అలాగే నార్మల్ వర్కింగ్ డే రిలీజ్ లు కొంచం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా సోలో రిలీజ్ కి ఇంకా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టాల్సింది. కానీ టాక్ ఎలాగూ పాజిటివ్ గానే ఉండటంతో లాంగ్ వీకెండ్ లో జోరు చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here