Home న్యూస్ నాని రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…. సరిపోదా శనివారం కుమ్మింది…కానీ!!

నాని రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్…. సరిపోదా శనివారం కుమ్మింది…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మీడియం రేంజ్ హీరోలలో మంచి మార్కెట్ ఉన్న హీరోగా నాచురల్ స్టార్ నాని(Nani) కి మంచి క్రేజ్ ఉంది….లాస్ట్ ఇయర్ 2 బాక్ టు బాక్ హిట్స్ ను సొంతం చేసుకున్న నాని ఈ ఇయర్ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమాతో…

రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నాడు…మొదటి రోజు ఈ సినిమా 5.88 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మంచి జోరునే చూపించింది…కానీ ఓవరాల్ గా బిగ్ సోలో రిలీజ్, మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సరిపోదా శనివారం….

ఇంకా బెటర్ గా ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా మొత్తం మీద యావరేజ్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన దసరా మీడియం రేంజ్ హీరోల సినిమాలలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోగా ఆ సినిమా తర్వాత ప్లేస్ లో…

సరిపోదా శనివారం నిలుస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా టాక్ కి తగ్గ న్యాయం అయితే చేయలేక పోయింది…ఒకసారి నాని నటించిన రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 

#Nani Recent Movies Day 1 AP TG Collections
👉#SaripodhaaSanivaaram – 5.88CR******
👉#HiNanna – 2.91CR
👉#DASARA – 14.22CR
👉#AnteSundaraniki – 3.87Cr
👉#ShyamSinghaRoy- 4.17Cr
👉#GangLeader- 4.57Cr
👉#JERSEY- 4.47Cr
👉#Devadas(Multi Starer) – 4.62Cr
👉#KrishnarjunaYuddham- 4.62Cr
👉#MCA- 7.57Cr

మొత్తం మీద సరిపోదా శనివారం మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా సినిమా మీద ఉన్న అంచనాలను ఫుల్ న్యాయం అయితే చేయలేదు…కానీ సినిమా కి మంచి పాజిటివ్ రివ్యూలు ఉన్న నేపధ్యంలో లాంగ్ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని సినిమా చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here