Home న్యూస్ 2nd డే సరిపోదా శనివారం కలెక్షన్స్….డే 2 హోల్డ్ చేసిందా….లేదా!!

2nd డే సరిపోదా శనివారం కలెక్షన్స్….డే 2 హోల్డ్ చేసిందా….లేదా!!

0
SARIPODHAA SANIVAARAM movie 2nd Day Box Office Collections
SARIPODHAA SANIVAARAM movie 2nd Day Box Office Collections

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మరీ అనుకున్న రేంజ్ లో జోరు చూపించక పోయినా కూడా ఓవర్సీస్ కలెక్షన్స్ హెల్ప్ తో వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ నే సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా….

రెండో రోజు శుక్రవారం వీకెండ్ స్టార్ట్ అయినా కూడా వర్కింగ్ డే నే అవ్వడంతో డే 2 ఓపెనింగ్స్ లో మార్నింగ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ కనిపించినా కూడా తిరిగి ఈవినింగ్ నైట్ షోల బుకింగ్స్ మంచి జోరునే చూపెడుతూ ఉండగా మొత్తం మీద రెండో రోజు మంచి కలెక్షన్స్ దిశగానే పరుగును కొనసాగిస్తుంది..

ఓవరాల్ గా ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు 35-40% రేంజ్ లో డ్రాప్స్ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా కొంచం డ్రాప్స్ ఉన్నా కూడా ఈవినింగ్ షోలకు మంచి జోరునే చూపెడుతూ ఉండగా మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే…

2వ రోజు తెలుగు రాష్ట్రాల్లో 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా 3.5 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా అంతకుమించి జోరు చూపిస్తే ఈ లెక్క ఇంకా మించవచ్చు…

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 4.6-5 కోట్ల రేంజ్ నుండి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఇంకా షేర్ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా లాంగ్ వీకెండ్ లో సినిమా జోరు ఇంకా ఎక్కువగా చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు…

ఎక్స్ లెంట్ గా కుమ్మేసింది అని చెప్పడానికి తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా 6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో నైట్ షోలకు సాలిడ్ గ్రోత్ ని చూపించి ఈ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి ఇప్పుడు.

Saripodhaa Sanivaaram Movie 1st Day Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here