మొదటి ఆటకే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఇక ఆ సినిమా వీకెండ్ లో మాస్ రచ్చ చేయడం ఖాయం, ఇక కొంచం క్రేజ్ ఉన్న సినిమాకి రెస్పాన్స్ బాగుంటే ఇక కలెక్షన్స్ పరంగా మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది కానీ లేటెస్ట్ గా ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్న…
నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ పరంగా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేస్తున్నా కూడా ఓవర్సీస్ లో, రెస్ట్ ఆఫ్ ఇండియాలో మంచి జోరుని చూపిస్తూ ఉండగా…
మూడో రోజులో ఎంటర్ అయిన సినిమా కి వీకెండ్ అండ్ పాజిటివ్ టాక్ అడ్వాంటేజ్ తో సాలిడ్ గ్రోత్ కనిపిస్తుంది అనుకున్నా కూడా తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ఇంపాక్ట్ మేజర్ సెంటర్స్ లో ఎక్కువగానే చూపించింది…అయినా కూడా ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా…
రెండో రోజు కన్నా కూడా బెటర్ గా ట్రెండ్ అయ్యాయి. కానీ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కొన్ని చోట్ల గ్రోత్ ఉన్నా కొన్ని చోట్ల వర్షాల ఇంపాక్ట్ ఉంది. అయినా కూడా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 3.5-4 కోట్ల రేంజ్ లో…
షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది…అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 4.5 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ సినిమా టాక్ అండ్ సోలో రిలీజ్ అండ్ బిజినెస్ లను దృష్టిలో పెట్టుకుంటే 5-5.5 కోట్లకు పైగానే షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది కానీ…
వర్షాల ఇంపాక్ట్ వలన ఇబ్బందులు తలెత్తాయి…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 3వ రోజున ఓవరాల్ గా 6 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే ఈ లెక్క కొంచం పెరిగే ఛాన్స్ ఉంది. ఇక టోటల్ గా 3 రోజుల్లో సినిమా అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.