మొదటి 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా గ్రోత్ ని చూపించ లేక పోయిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా మూడో రోజు శనివారం రోజున మాస్ రచ్చ చేసి అంచనాలను మించి జోరు చూపించింది….భారీ వర్షాలను తట్టుకుని సైతం అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా…
ఇప్పుడు 4వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా ఓపెనింగ్స్ కనిపిస్తూ ఉండగా ఆన్ లైన్ టికెట్ సేల్స్ పరంగా ఆల్ మోస్ట్ మూడో రోజు లెవల్ లో బుకింగ్స్ కనిపిస్తూ ఉండగా నైట్ షోలకు కూడా ఇదే ట్రెండ్ ఉండే అవకాశం ఉన్నా కూడా నైట్ షోలకు తర్వాత రోజు వర్కింగ్ డే ఉండటంతో కొంచం డ్రాప్స్ ఉండే అవకాశం ఉండగా…
అయినా కూడా ఓవరాల్ గా 4వ రోజు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి జోరుని చూపించి 4 కోట్లకు పైగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఆంధ్ర సీడెడ్ లలో గ్రోత్ ఎక్కువగా ఉంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక తమిళ్, కర్ణాటక మరియు ఓవర్సీస్ లలో సినిమా మరోసారి ఎక్స్ లెంట్ గా…
జోరుని చూపిస్తూ దూసుకు పోతూ ఉండటంతో ఓవరాల్ గా 4వ రోజు వరల్డ్ వైడ్ గా సరిపోదా శనివారం మాస్ రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి..భారీ వర్షాలు ఇబ్బంది పెట్టినా కూడా సినిమా ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది, వర్షాలు ఇబ్బందులు లేకుండా ఉండి ఉంటే ఓవరాల్ గా కలెక్షన్స్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా మొదటి 2 రోజులు కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా 3వ రోజు నుండి వర్షాలను కూడా తట్టుకుని ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తుంది. ఇక 4వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ఎంతవరకు జోరుని ఇలానే కొనసాగించి అనుకున్న అంచనాలను ఎంతవరకు మించి పోతుందో చూడాలి ఇక….