బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా మంచి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తూ బ్రేక్ ఈవెన్ వైపు పరుగులు పెడుతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie Box Office Collections) సినిమా….
6వ రోజు వర్కింగ్ డే లో మరోసారి మంచి జోరుని చూపించగా 7వ రోజు వర్కింగ్ డే లో ఎంటర్ అయ్యి మరోసారి మంచి జోరునే చూపిస్తూ రన్ ని కొనసాగిస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాల వలన డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద…
7వ రోజు 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని అటూ ఇటూగా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి షేర్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక కర్ణాటక, తమిళ్ మరియు ఓవర్సీస్ లలో సినిమా మంచి హోల్డ్ ని…
చూపెడుతూ ఉండగా మొత్తం మీద సినిమా 7వ రోజు వరల్డ్ వైడ్ గా 1.1 కోట్ల నుండి 1.2కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ ఓవరాల్ గా పెరిగే అవకాశం ఉంది….మొత్తం మీద మొదటి వారాన్ని సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
కంప్లీట్ చేసుకోబోతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో మాత్రం బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక మొత్తం మీద మొదటి వారానికి గాను ఏరియాల వారిగా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…