Home న్యూస్ విజయ్ “ది గోట్” ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

విజయ్ “ది గోట్” ప్రీమియర్ షో రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0
Thalapathy Vijay The Greatest Of All Time Movie Review
Thalapathy Vijay The Greatest Of All Time Movie Review

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్  టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie USA REVIEW) ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చేసింది…. ముందుగా ప్రీమియర్స్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ ను పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ స్పెషల్ పోలిస్ స్క్వాడ్ లో పని చేసి రిటైర్ అయిన హీరో అనుకోకుండా ఒక మిషన్ ని లీడ్ చేయాల్సి వస్తుంది…ఆ మిషన్ ఏంటి..ఆ హీరో చేతిలో ఓడిపోయిన విలన్ హీరో పై పగ తీర్చుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

సినిమా స్టార్ట్ అవ్వడం చాలా ఆసక్తిగా స్టార్ట్ అయ్యి ఫ్యామిలీ అండ్ కామెడీ సీన్స్ తో పర్వాలేదు అనిపిస్తూ అసలు కథలోకి ఎంటర్ అవుతుంది…అక్కడ నుండి కథ ఆసక్తిగా సాగగా అక్కడక్కడా కథ కొంచం స్లో అయిన ఫీలింగ్ కలిగినా కూడా ఇంటర్వెల్ ఎపిసోడ్ సాలిడ్ హై ఇచ్చి…

సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ అలాగే కొన్ని చోట్ల కథని ఈజీగానే ప్రిడిక్ట్ చేసేలా ఉన్నా కూడా, విజువల్స్ పరంగా కానీ గ్రాండియర్ కానీ ఎక్స్ లెంట్ గా ఉండటం, ఇక విజయ్ డిఫెరెంట్ రోల్స్ అండ్ గెటప్స్ తో కుమ్మేయడం…

అలాగే తన ప్రీవియస్ మూవీస్ నుండి కొన్ని మ్యానరిజమ్స్ ను చూపించిన విధానం బాగా ఆకట్టుకుంది… ఓవరాల్ గా లెంత్ కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగింది, అలాగే సంగీతం పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించలేదు…

అయినా ఓవరాల్ గా ఫస్టాఫ్ యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అన్న టాక్ వినిపిస్తుంది…మొత్తం మీద సినిమా ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా ఉందన్న టాక్ ప్రీమియర్స్ కంప్లీట్ అయిన తర్వాత వినిపించగా ఇదే రేంజ్ లో టాక్ ఇక్కడ…

కూడా వినిపిస్తే మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ మాస్ జాతర చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది…మొత్తం మీద సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కి సినిమా బాగానే నచ్చే అవకాశం ఉండగా రెగ్యులర్ ఆడియన్స్ కి ఎబో యావరేజ్ లెవల్ లో ఉండొచ్చు అనిపించే రేంజ్ టాక్ ను సొంతం చేసుకున్న…

ది గోట్ మూవీ ఇప్పుడు కామన్ ఆడియన్స్ నుండి రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి….రెగ్యులర్ షోలకు ఇదే రేంజ్ టాక్ వస్తే లాంగ్ వీకెండ్ లో విజయ్ మాస్ పవర్ ను చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here