Home న్యూస్ 35 మూవీ రివ్యూ- ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా!!

35 మూవీ రివ్యూ- ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా!!

0

రొటీన్ కథలు, కొత్తదనం లేని సినిమాలు, ఓవర్ డోస్ అనిపించే సీన్స్ తో నిండిపోతున్న ప్రస్తుతం వస్తున్న సినిమాలకు పూర్తి విరుద్ధంగా….చిన్న సినిమానే అయినా కూడా మంచి క్లాసిక్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 35 మూవీ(35 Movie Review) అనే సినిమా రిలీజ్ అయ్యింది…డీసెంట్ స్టార్ కాస్ట్ తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కిన ఈ సినిమా…

ఎలా ఉంది…ఎంతవరకు మెప్పించింది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ కి వస్తే బస్ కండక్టరుగా పని చేసే తండ్రి….10వ తరగతి ఫెయిల్ అయిన సాధారణ తల్లి…ఇద్దరు కొడుకులు…అందులో పెద్ద కొడుకుకి లెక్కల్లో ఎప్పుడూ జీరో మార్కులు….ఒకసారి ఫెయిల్ అవ్వడంతో డిమోట్ కూడా అయి పెద్ద కొడుకుని…

అందరూ జీరో జీరో అంటూ పిలుస్తారు…అలాంటి పెద్ద కొడుకుని తన తల్లి ఎలా మారేలా చేసింది….లెక్కల మాస్టార్ అయిన ప్రియదర్శి ఎందుకని పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉంటారో లాంటి విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సింపుల్ కథ పాయింట్ తో వచ్చినా కూడా…

మంచి డెప్త్ ఉన్న సీన్స్ తో, ఆలోచింపజేసే డైలాగ్స్ తో డైరెక్టర్ సినిమాను చెప్పిన విధానం చాలా బాగా మెప్పించింది…. రొటీన్ సినిమాల నడుమ 35 మూవీ చాలా స్పెషల్ మూవీలా అనిపించడం ఖాయం…ఇద్దరు పిల్లల తల్లిగా నివేతా థామ‌స్ ఎక్స్ లెంట్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చింది…తండ్రి రోల్ లో విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌ ఆకట్టుకోగా…

లెక్కల మాస్టర్ గా ప్రియదర్శి అదరగొట్టేశాడు…ఇక పిల్లలందరూ చాలా బాగా నటించారు….సంగీతం పర్వాలేదు అనిపించేలా ఉండగా సినిమాకి ఉన్న ఓకే ఒక్క మైనస్ పాయింట్…స్లో నరేషన్….ఇలాంటి క్లాసిక్ అనిపించే సినిమాలకు స్లో నరేషన్ అన్నది కొంచం ఇబ్బంది పెట్టె అంశం…

కానీ ఆ స్లో నరేషన్ ని తట్టుకుని, కొత్త తరహా కథలను ఇష్టపడే వాళ్ళు, అలాగే ప్రతీ పేరెంట్స్ చూడవలసిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది….సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక సారి ఆ పాత్రలతో మనం కనెక్ట్ అయిన తర్వాత…తర్వాత కథ ఏమవుతుంది అని మనకు తెలిసిపోయినా కూడా…

ఆ పాత్రలతో మనం కలిసి పోయి ఆ పాత్రల గెలుపును మనం ఎంజాయ్ చేస్తాం….డైరెక్టర్ చెప్పిన విధానం చాలా బాగా మెప్పించగా అక్కడక్కడా కొంచం స్లో అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా పరంగా ఫుల్ మార్కులు పడతాయి…ప్రతీ ఒక్కరు చూడదగ్గ సినిమా 35 మూవీ…ముఖ్యంగా పేరెంట్స్ కచ్చితంగా చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here