Home న్యూస్ విజయ్ G.O.A.T…1st డే ఓపెనింగ్స్….లెక్క 100 నుండి మొదలు??

విజయ్ G.O.A.T…1st డే ఓపెనింగ్స్….లెక్క 100 నుండి మొదలు??

0

రిలీజ్ కి ముందు పెద్దగా బజ్ లేక పోయినా కూడా తన స్టార్ పవర్ ను చూపెడుతూ కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ ఓపెనింగ్స్ ను అన్ని చోట్లా సొంతం చేసుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…

సినిమా తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ విషయానికి వస్తే విజయ్ లాస్ట్ మూవీ లియో మూవీతో పోల్చితే వీక్ స్టార్ట్ నే సొంతం చేసుకున్నా కూడా ప్రజెంట్ సినిమా బజ్ దృశ్యా పర్వాలేదు అనిపించేలానే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. సినిమా బుకింగ్స్ షో షోకి ఇంప్రూవ్ అవుతూ ఉండటంతో…

సినిమా డే ఎండ్ అవ్వడం మంచి కలెక్షన్స్ తో ముగించే అవకాశం ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 2.8-3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా…

ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు సాలిడ్ గా ఉండటంతో మొదటి రోజు లెక్క 30 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటక, కేరళలో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ ఉండటం తో రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా బాగానే జోరుని చూపెడుతూ ఉండగా…

ఓవరాల్ గా మొదటి రోజు ఇండియాలోనే లెక్క 50 కోట్లకు పైగా ఉండే గ్రాస్ ఉండే అవకాశం ఎంతైనా ఉండగా ఓవర్సీస్ లో 4.5 మిలియన్స్ కి పైగా డాలర్స్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 5 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంటుంది…

దాంతో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా 90-100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా నైట్ షోల లెక్కలను బట్టి సినిమా 100 కోట్ల మార్క్ ని దాటేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక మొదటి రోజు ఎండ్ అయ్యే టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here