బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమాకి తన రేంజ్ ను పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) తెలుగు లో కూడా మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నాడు…ఇక్కడ విజయ్ సినిమాలకు ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ సొంతం అవుతూ ఉండగా…..
లాస్ట్ ఇయర్ వచ్చిన లియో మూవీ ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ హీరోల సినిమాల రేంజ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది. అలాంటి సినిమా తర్వాత గోట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన విజయ్ కి ఇక్కడ రెస్పాన్స్ మిక్సుడ్ గా రాగా ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే అంచనాలను అందుకునే విషయంలో ఈ సినిఅమ దారుణంగా విఫలం అయ్యింది.
మినిమమ్ 3 కోట్లకు పైగానే షేర్ ని అందుకుంటుంది అని అనుకున్నా కూడా ఓవరాల్ గా ట్రాక్ చేసిన గ్రాస్ మార్క్ అదే రేంజ్ లో ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కూడా మరీ గ్రోత్ ని పెద్దగా చూపించక పోవడంతో ఫైనల్ లెక్కలు ఇప్పుడు 3.6-4 కోట్ల రేంజ్ లో ఉండబోతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో…
విజయ్ కెరీర్ లో రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్ అన్నింటిలోకి ఇవి లోవేస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పాలి. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల షేర్ 2 కోట్లకు పైగా ఉండబోతుండగా సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్ల రేంజ్ లో ఉండబోతుండగా సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర…
మరో 20 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…సినిమాకి పర్వాలేదు అనిపించే రేంజ్ రెస్పాన్స్ ఉన్నప్పటికీ కూడా ఆడియన్స్ ఎందుకో విజయ్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే ఈ సినిమాను అస్సలు పట్టించుకోలేదు. ఇక సినిమా లాంగ్ వీకెండ్ లో తెలుగు లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.