Home న్యూస్ ట్రైలర్ కూడా రాలేదు…అక్కడ 1 మిలియన్ ఔట్…టైగర్ మాస్ ఇది!!

ట్రైలర్ కూడా రాలేదు…అక్కడ 1 మిలియన్ ఔట్…టైగర్ మాస్ ఇది!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) తన మాస్ పవర్ ను చూపెడుతున్నాడు…ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ అయిన దేవర(Devara Part 1 Movie) భారీ అంచనాల నడుమ ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా….సినిమా అఫీషియల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉండగా మరో పక్క…

అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో ఊచకోత కోస్తూ ఎన్టీఆర్ మాస్ పవర్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…నార్త్ అమెరికాలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా రిమార్కబుల్ బుకింగ్స్ తో…

రచ్చ చేస్తున్న సినిమా ఓవరాల్ గా వీకెండ్ కి గాను జరిగిన అడ్వాన్స్ ప్రీ బుకింగ్స్ తో ఏకంగా 1 మిలియన్ మార్క్ బుకింగ్స్ ను ఇప్పటి వరకు సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ మాస్ రచ్చ చేస్తుంది…మొత్తం మీద రీసెంట్ టైంలో రిలీజ్ అయిన…

బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే దేవర ప్రీ బుకింగ్స్ రేంజ్ మరో లెవల్ లో దూసుకు పోతూ ఫాస్టెస్ట్ రికార్డులతో మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం. ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 8 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ ను ఆల్ రెడీ దాటేసిన సినిమా ఇప్పుడు ప్రీమియర్స్ తో…

నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను ప్రీమియర్స్ కి గాను అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ కనుక అనుకున్న రేంజ్ కి మించి ఉంటే కనుక ఓపెనింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో రచ్చ చేసే ఛాన్స్ ఎంతైనా ఉంది. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ తన రేంజ్ పవర్ ను చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here