Home న్యూస్ నాలుగు సార్లు 300….కోలివుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

నాలుగు సార్లు 300….కోలివుడ్ చరిత్రలో ఒకే ఒక్కడు!!

0

కోలివుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీ(Rajinikanth) నటించిన సినిమాలు టాక్ ఎలా ఉన్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసేవి….తర్వాత టైంలో అలాంటి స్టార్ డంని సొంతం చేసుకున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమాతో…

తన స్టార్ డం పవర్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతున్నాడు…రిలీజ్ కి ముందు పెద్దగా హైప్ ఏమి లేక పోయినా కూడా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని లాంగ్ వీకెండ్ లో సొంతం చేసుకున్న విజయ్ ఇప్పుడు…

5వ రోజు వర్కింగ్ డే కలెక్షన్స్ తో కూడా మంచి హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేయగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఓవరాల్ గా 300 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని దాటేసింది. హైప్ లేని సినిమా, మిక్సుడ్ రెస్పాన్స్ తో 5 రోజుల్లోనే 300 కోట్ల మార్క్ ని అందుకోవడం అంటే…

The Greatest Of All Time 3 Days Total WW Collections!!

మామూలు విషయం కాదు…ఇక ఈ సినిమా తో మొత్తం మీద తన కెరీర్ లో 4 సారి 300 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు విజయ్….మొత్తం మీద తన కెరీర్ లో ఇది వరకు బిగిల్ మూవీ, వారిసు సినిమా అలాగే లియో సినిమాలు 300 కోట్ల మార్క్ ని దాటేయగా…

ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమాతో 4వ సారి ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా కోలివుడ్ హీరోలలో మరెవ్వరూ కూడా ఈ లీగ్ లో విజయ్ దరిదాపుల్లో కూడా లేక పోవడం ప్రజెంట్ తన స్టార్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక మిక్సుడ్ రెస్పాన్స్ తో వర్కింగ్ డేస్ లో….

మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఇదే రేంజ్ లో జోరు ని లాంగ్ రన్ లో కొనసాగిస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలోనే వరల్డ్ వైడ్ గా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి లాంగ్ రన్ లో సినిమా ఎంత దూరం వెళుతుందో చూడాలి ఇప్పుడు.

The Greatest Of All Time 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here