కోలివుడ్ లో ఒకప్పుడు సూపర్ స్టార్ రజినీ(Rajinikanth) ఊరమాస్ స్టార్ పవర్ తో రికార్డులు ఎన్నో క్రియేట్ చేశాడు. హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఎన్నో సార్లు అందుకున్నాడు…ఆ తర్వాత రజినీ రేంజ్ ని మించి ఇప్పుడు కోలివుడ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపెస్తున్నాడు ఒకే ఒక్కడు…
కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా అన్ని చోట్లా ఈ సినిమా కలెక్షన్స్ ఓవరాల్ గా చూస్తె 6 రోజుల్లోనే…
320 కోట్ల మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించింది…కాగా సరిగ్గా 11 నెలల క్రితం ఆడియన్స్ ముందుకు లియో సినిమాతో వచ్చిన దళపతి విజయ్ ఆ సినిమాతో కూడా మిక్సుడ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా కలెక్షన్స్ పరంగా ఊహకందని రికార్డులను నమోదు చేస్తూ…
టోటల్ రన్ లో ఏకంగా 600 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించాడు….ఇప్పుడు 11 నెలల గ్యాప్ లో ఆడియన్స్ ముందుకు రీసెంట్ టైంలో తన కెరీర్ లో లోవెస్ట్ బజ్ తో వచ్చిన గోట్ మూవీ 320 కోట్లను ఆల్ రెడీ దాటేయగా…
ఓవరాల్ గా 11 నెలల గ్యాప్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర 920 కోట్ల గ్రాస్ ను అందుకుని సంచలనం సృష్టించాడు విజయ్….లాస్ట్ ఇయర్ లో కూడా సంక్రాంతికి వారిసు సినిమాతో 10 నెలల గ్యాప్ లో లియోతో 900 కోట్ల మార్క్ ని దాటేసిన విజయ్…
లాంగ్ రన్ లో ఇప్పుడు గోట్ మూవీ 400 కోట్ల మార్క్ ని దాటేస్తే ఏడాది గ్యాప్ లో 1000 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ తో కోలివుడ్ చరిత్రలో ఎవ్వరూ అందుకోలేని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక గోట్ మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.