Home న్యూస్ దేవర…ఈ రేంజ్ ట్రోల్స్ ఏంటి సామి….కారణాలు ఏంటి అసలు!!

దేవర…ఈ రేంజ్ ట్రోల్స్ ఏంటి సామి….కారణాలు ఏంటి అసలు!!

0

మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ ఎక్కువ మంది ఉంటారు…దాంతో సహజంగానే ప్రతీ హీరో సినిమా వచ్చినప్పుడు ఇతర హీరోల ఫ్యాన్స్ సినిమా బాలేదు అంటూ గొడవలు పడటం, సోషల్ మీడియాలో ట్రోల్స్ పడటం అనేది కామన్ గా జరుగుతూ ఉంటుంది…కానీ లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ కే మరో లెవల్ లో…

ట్రోల్స్ అండ్ గొడవలను ఫేస్ చేస్తుంది యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన దేవర(Devara Part 1) సినిమా విషయంలో…6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో హీరో మూవీ అయిన దేవర మీద అంచనాలు భారీగా ఉన్నాయి…RRR మూవీతో రామ్ చరణ్(Ram Charan) తో కలిసి ఎన్టీఆర్ నటించినా కూడా…

 RRR టైం నుండే మా హీరో గొప్ప మా హీరో గొప్ప అంటూ మెగా అండ్ నందమూరి హీరోల మధ్య గొడవలు జరిగాయి…ఆచార్య టైం లో ట్రోల్స్ ఇంకా గట్టిగానే పడ్డాయి, కానీ అది సినిమా రిలీజ్ అయ్యాక జరిగింది, కానీ ఇప్పుడు దేవర ట్రైలర్ నుండే ఇది జరుగుతుంది….ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు పెద్దగా ట్రోల్స్ ఏమి లేవు కానీ…

ట్రైలర్ రిలీజ్ తర్వాత సోషల్ మీడియా మొత్తం ఈ ట్రోల్స్ తో నిండిపోయాయి….దీనికి ఒక కారణం దేవర ప్రమోషనల్ టీం కూడా అని చెప్పొచ్చు….సినిమా పోస్టర్స్ బాగున్నా అవి మరింత క్వాలిటీగా ఉండాల్సిన అవసరం ఉంది, అవి చూసుకోలేదు…ఇక సినిమా నుండి వచ్చిన టైటిల్ సాంగ్ హుకుం తో పోల్చారు…

రిలీజ్ అయ్యాక సాంగ్ బాగున్నా హుకుం రేంజ్ లో లేదన్న ట్రోల్స్ పడ్డాయి కానీ లాంగ్ రన్ లో టైటిల్ సాంగ్ మంచి రీచ్ నే సొంతం చేసుకుంది…ఇక లేటెస్ట్ గా వచ్చిన దావుదీ సాంగ్ లో ఎన్టీఆర్ సిగ్నేచర్ స్టెప్స్ వేశారు, అవి ఇప్పటి వరకు ఏ సినిమాలో చూసి ఉండరు అంటూ హైలెట్ చేశారు…

తీరా సాంగ్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ స్టెప్స్ బాగానే కుమ్మేసినా టీం ఇచ్చిన హైప్ ను మ్యాచ్ చేయలేదు…ఇక ట్రైలర్ రిలీజ్ కి ముందే హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ ఉంటాయని, గేమ్ ఆఫ్ త్రోన్స్ కి ధీటుగా సినిమా విజువల్స్ ఉంటాయి అంటూ మరోసారి హైప్ పెంచారు….

కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత రొటీన్ కథనే అయినా విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఎన్టీఆర్ వలన ట్రైలర్ బాగుంది అనిపించేలా ఉంది కానీ, టీం ఊదరగొట్టినట్లు ఇది కదా ట్రైలర్ అనిపించే రేంజ్ లో లేదు….ఇదంతా ఇతర హీరోల ఫ్యాన్స్ నోట్ చేసుకుని ప్రతీ అంశం మీద ట్రోల్స్ చేయడం మొదలు పెట్టి అది హద్దులు కూడా దాటిపోయింది….

6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ అంటేనే హైప్ భారీగా ఉంటుంది, దానికి మించిన హైప్ పెంచాల్సిన అవసరం లేదు కానీ టీం చేస్తున్న ఓవర్ హైప్ వలన అది ఇతర ఫ్యాన్స్ చేత భారీగా ట్రోల్స్ కి కారణం అవుతుంది…. 

టీం ఎంత హైప్ పెంచాలని చూసినా, సోషల్ మీడియాలో హద్దులు మీరిన ట్రోల్స్ ఎన్ని పడినా కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ వస్తేనే ఏ సినిమా అయినా సేఫ్ అయ్యేది…కానీ ఓవర్ హైప్ వలన పాజిటివ్ టాక్ వచ్చినా కూడా హైప్ కి తగ్గట్లు టాక్ లేక పోతే అది మిక్సుడ్ నుండి నెగటివ్ టాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది…..

అలాగే ట్రోల్స్ విషయంలో హద్దులు మీరిపోతున్నా అది ఫ్యాన్స్ ఎమోషన్ కాబట్టి ఎవ్వరూ ఏమి చేయలేరు…అవి ఆగమన్నా కూడా ఇటు వీళ్ళు అటు వాళ్ళు ఆపరు. కానీ ట్రోల్స్ కి ఛాన్స్ ఇవ్వకుండా కంటెంట్ ను ప్రమోట్ చేసుకోవాల్సిన భాద్యత్య  సినిమా టీం మీదే ఎక్కువగా ఉంటుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here