Home న్యూస్ అట్టర్ ఫ్లాఫ్ మూవీ…రీ రీ రిలీజ్ కి ఇవేం కలెక్షన్స్ రా బాబు!!

అట్టర్ ఫ్లాఫ్ మూవీ…రీ రీ రిలీజ్ కి ఇవేం కలెక్షన్స్ రా బాబు!!

0

రీ రిలీజ్ ల ట్రెండ్ లో ఆడియన్స్ ముందుకు చాలా సినిమాలు వచ్చాయి కానీ వాటిలో కొన్ని సినిమాలు మాత్రమే ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో సక్సెస్ ఫుల్ గా నిలిచాయి… రెండేళ్ళ క్రితం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ స్టార్ట్ అవ్వగా ఆ టైంలో అట్టర్ ఫ్లాఫ్ అయిన సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అయ్యి దుమ్ము లేపాయి…

వాటిలో ధనుష్(Dhanush) శృతి హాసన్(Shruthi Haasan) ల కాంబోలో వచ్చిన 3 మూవీ(3 Movie) కూడా ఒకటి…ఆ టైంలో లిమిటెడ్ షోలతో మాస్ రచ్చ చేసిన సినిమా ఇప్పుడు మళ్ళీ రెండేళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మళ్ళీ రీ రీ రిలీజ్ అయ్యింది..

రీసెంట్ గా రీ రిలీజ్ ల ట్రెండ్ టాలీవుడ్ లో మళ్ళీ మొదలు అవ్వగా మూడు సినిమాలు మంచి రచ్చ చేశాయి. కానీ రీ రీ రిలీజ్ అవుతున్న 3 మూవీని ఈ సారి ఎవరు పట్టించుకోరు అనుకుంటే అందరినీ ఆశ్యర్య పరుస్తూ సినిమా హౌస్ ఫుల్ బోర్డులతో తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ ను అందుకుని కుమ్మేస్తింది.

ఆల్ రెడీ టికెట్ సేల్స్ పరంగా మంచి జోరు ని చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఒక్క హైదరాబాదులోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో 35 లక్షల మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది.. నైజాంలో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించగా ఆంధ్రలో కూడా సినిమాకి…

బుకింగ్స్ బాగానే ఉండటంతో మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఓవరాల్ గా గ్రాస్ లెక్క ఇప్పుడు 70 లక్షలకి పైగా ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక సినిమా డే ఎండ్ అయ్యే టైంకి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి. అట్టర్ ఫ్లాఫ్ అయిన మూవీ రీ రీ రిలీజ్ లో ఇలాంటి కలెక్షన్స్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here