Home న్యూస్ రాజ్ తరుణ్ భలే ఉన్నాడే రివ్యూ….హిట్టా-ఫట్టా!

రాజ్ తరుణ్ భలే ఉన్నాడే రివ్యూ….హిట్టా-ఫట్టా!

0

కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టి మంచి ప్రామిసింగ్ హీరో అవుతాడు అనుకున్నా కూడా రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్ వలన వరుస ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ మొత్తాన్ని కోల్పోయిన యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని ఎంత ట్రై చేసినా కూడా కుదరడం లేదు…ఇలాంటి టైం లో రీసెంట్ గా 2 సినిమాలతో…

బాక్ టు బాక్ ఆడియన్స్ ముందుకు వచ్చి నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ ఇప్పుడు ట్రైలర్ ఆకట్టుకోవడంతో కొంచం ప్రామిసింగ్ గా అనిపించిన భలే ఉన్నాడే(Bhale Unnade Movie Review) తో వచ్చేశాడు. మరి ఈ సినిమాతో ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ..

కథ పాయింట్ కి వస్తే పెళ్ళిళ్ళకి పెళ్లి కూతుర్లని రెడీ చేసే శారీ డ్రెస్సర్ గా పని చేస్తూ ఉంటాడు, తన మాట పద్దతి అమ్మాయిలకు దూరంగా అలాగే కొంచం అమ్మాయిలానే అనిపిస్తూ ఉండటంతో తన క్యారెక్టర్ పై సందేహాలు ఏర్పడతాయి…తర్వాత హీరోయిన్ తో పరిచయం ప్రేమ జరగగా ఇద్దరికీ పెళ్లి…

సెట్ అవుతున్న టైంలో ఒక అనుమానం వలన హీరోయిన్ తీసుకునే నిర్ణయం తర్వాత కథ ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఓవరాల్ గా మంచి పాయింట్ నే డైరెక్టర్ తీసుకున్నా కూడా చెప్పిన విధానం మాత్రం కొన్ని సీన్స్ వరకు తప్పితే ఓవరాల్ గా సినిమా పరంగా ఇంప్రెస్ చేయలేక పోయింది…

కొన్ని సీన్స్ బాగానే రాసుకున్నా కూడా ఓవరాల్ గా కథ చాలా స్లోగా రిపీటివ్ గా అనిపించడం, కథ ఎటు నుండి ఎటో వెళ్ళిన ఫీలింగ్ కలగడంతో చూస్తున్న ఆడియన్స్ చాలా వరకు బోర్ ఫీల్ అయ్యేలా చేసింది. ఫస్టాఫ్ వరకు పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించినా కూడా సెకెండ్ ఆఫ్ కథ పూర్తిగా ట్రాక్ తప్పినట్లు అనిపించింది..

అక్కడక్కడా కొన్ని సీన్స్ పర్వాలేదు అనిపించినా, కొన్ని చోట్ల ఎంటర్ టైన్ మెంట్ కూడా ఓకే అనిపించినా కూడా కథ డ్రాగ్ అవ్వడం, బోర్ ఫీల్ అయ్యేలా చేయడం తో చూస్తున్న ఆడియన్స్ కి చాలా ఓపిక అవసరం అని చెప్పాలి. రాజ్ తరుణ్ తన రోల్ వరకు బాగానే చేశాడు…

హీరోయిన్ కూడా ఒక అనిపించగా కొన్ని చోట్ల సీన్స్ అండ్ కామెడీ పర్వాలేదు అనిపించడం ఒక్కటి సినిమాకి ప్లస్ పాయింట్….కానీ మిగిలిన సినిమా పెద్దగా ఇంప్రెస్ చేయలేక పోయింది. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ని అనేక ఎమోషన్స్ ని మిక్స్ చేసి కన్ఫ్యూజ్ చేయకుండా…

ఎంటర్ టైన్ మెంట్ వే లో చెప్పి ఉంటే బాగుండేది….మొత్తం మీద రాజ్ తరుణ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే కొంచం పర్వాలేదు అనిపించినా ఆడియన్స్ కి చాలా ఓపిక అవసరం, అంత ఓపిక పట్టి చూస్తె కొన్ని సీన్స్ బాగున్నాయి అనిపించినా ఓవరాల్ గా మూవీ బిలో యావరేజ్ రేంజ్ లోనే ఉందనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here