Home న్యూస్ అట్టర్ ఫ్లాఫ్ మూవీ…హౌస్ ఫుల్ బోర్డులు….సెన్సేషనల్ రాంపెజ్!

అట్టర్ ఫ్లాఫ్ మూవీ…హౌస్ ఫుల్ బోర్డులు….సెన్సేషనల్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు కొలవరి సాంగ్ వలన ఊహకందని హైప్ తో వచ్చిన ధనుష్(Dhanush) నటించిన 3 మూవీ(3 Movie Re Release Collections), భారీ హైప్ కి ఏమాత్రం అంచనాలను అందుకోలేక భారీ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోగా….సాంగ్స్ కి తర్వాత టైంలో మంచి హైప్ వచ్చింది…

రెండేళ్ళ క్రితం సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అవ్వగా లిమిటెడ్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రెండేళ్ళ తర్వాత సినిమా రీ రీ రిలీజ్ అవ్వగా ఈ సారి మాత్రం ఊహకందని రేంజ్ లో అంచనాలను మించి పోయే రేంజ్ లో ఊచకోత కోసింది.

సినిమా హైదరాబాదు లో 40 లక్షలకు పైగా ప్రీ బుకింగ్స్ ను, తెలుగు రాష్ట్రాల్లో 90 లక్షల రేంజ్ లో ప్రీ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ రోజున హైదరాబాదు లో, వైజాగ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన సినిమా లిమిటెడ్ షోలతో కూడా హెవీగా హౌస్ ఫుల్…

బోర్డులతో దుమ్ము దుమారం లేపింది సినిమా….దాంతో ఓపెనింగ్ డే రోజున సినిమా అతి కొద్ది సినిమాలు మాత్రమే సాధించిన 1 కోటి రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే మొదటి రోజు 1.2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు, ఓవరాల్ గా అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా కి ఇప్పుడు రీ రీ రిలీజ్ లో ఈ రేంజ్ లో మాస్ రచ్చ చేసే కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here