Home న్యూస్ రిలీజ్ అయినప్పుడు కన్నా 3 రెట్లు….డే1 రీ రిలీజ్ తుంబాద్ కలెక్షన్స్!

రిలీజ్ అయినప్పుడు కన్నా 3 రెట్లు….డే1 రీ రిలీజ్ తుంబాద్ కలెక్షన్స్!

0

కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కన్నా తర్వాత డిజిటల్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నవి చాలానే సినిమాలు ఉన్నాయి, అలాంటి సినిమాలలో కూడా ఈ సినిమా థియేటర్స్ లో ఎందుకు అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేదా అన్న ఫీలింగ్ ను కలిగించిన రేర్ మూవీస్ లో బాలీవుడ్ లో 2018 టైంలో తెరకెక్కిన…

తుంబాద్(Tumbbad Re Release) సినిమా ఒకటి అని చెప్పాలి. హర్రర్ ఫాంటసీ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ హర్రర్ మూవీస్ లో ముందు నిలుస్తుంది అని చెప్పాలి. డిజిటల్ లో ఆ రేంజ్ లో రచ్చ చేసిన ఈ సినిమా…

ఎప్పటి నుండో థియేటర్స్ లో రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు, ఎట్టకేలకు రిలీజ్ అయిన 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు సినిమాను రీ రిలీజ్ చేయగా సినిమా మొదటి రోజు ఫస్ట్ టైం రిలీజ్ అయిన కలెక్షన్స్ మీద ఏకంగా…3 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని ఎక్కువగా సొంతం చేసుకుంది.

సినిమా 2018 టైంలో రిలీజ్ అయినప్పుడు 65 లక్షల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అయినప్పుడు ఆల్ మోస్ట్ 1.70 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, అంటే రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ కన్నా ఇప్పుడు…

3 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించగా ఇప్పుడు రీ రిలీజ్ లాంగ్ రన్ లో ఈ సినిమా మినిమమ్ 18-20 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 12 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ రావడం కూడా విశేషం అని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here