బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టినా కూడా తర్వాత కెరీర్ లో సరైన సినిమాలు ఎంచుకునే విషయంలో పూర్తిగా విఫలం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్(Raj Tarun) పూర్తిగా డౌన్ అయిపోయాడు బాక్స్ ఆఫీస్ దగ్గర…కెరీర్ మొదట్లో హాట్రిక్ విజయాలతో మంచి ప్రామిసింగ్ హీరోగా…
అనిపించినా కూడా తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో పూర్తిగా స్లో అయిన రాజ్ తరుణ్, సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమాల పెర్ఫార్మెన్స్ మాత్రం ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయ్యాయి… రీసెంట్ గా బాక్ టు బాక్…
50 రోజుల గ్యాప్ లో 3 సినిమాలను రిలీజ్ చేసిన రాజ్ తరుణ్ కి మూడు సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అయ్యాయి. లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే(Bhale Unnade Collections) తో వచ్చిన రాజ్ తరుణ్ కి ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోవడంతో…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత మెప్పిస్తుంది అని అనుకున్నా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించలేక పోయిన సినిమా మొదటి 2 రోజుల్లో 8 వేల లోపు టికెట్ సేల్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా 30 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా….
తర్వాత 5 రోజుల్లో మరో 30 లక్షల లోపే గ్రాస్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా మొదటి వారంలో 60 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా వర్త్ షేర్ 30 లక్షల లోపు మాత్రమే రావడం తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి. అది కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీయకుండా…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో రాజ్ తరుణ్ హిట్ వేట కొనసాగుతూనే ఉండగా వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న రాజ్ తరుణ్ ఫ్యూచర్ లో చేసే సినిమాలతో అయినా కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.