Home న్యూస్ రీ రిలీజ్ లో ఎపిక్ కలెక్షన్స్…ధనుష్ 3 మూవీ ఊరమాస్ రాంపెజ్!

రీ రిలీజ్ లో ఎపిక్ కలెక్షన్స్…ధనుష్ 3 మూవీ ఊరమాస్ రాంపెజ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా తిరిగి రీ రిలీజ్ ల ట్రెండ్ ఈ మధ్యనే స్టార్ట్ అవ్వగా 3 సినిమాలు రీ రిలీజ్ లో మంచి జోరు ని చూపించగా, ఊహించని విధంగా మరో రీ రిలీజ్ మూవీ సాలిడ్ కలెక్షన్స్ తో మాస్ భీభత్సం సృష్టించింది. మిగిలిన సినిమాల మీద అంచనాలు ఉండటంతో కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపించాయి కానీ…

ఈ సినిమా మీద మాత్రం అసలు ఏమాత్రం అంచనాలు లేవు కానీ మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా మాస్ రాంపెజ్ ను చూపెట్టి ఆల్ మోస్ట్ 5 రోజుల పాటు రన్ ని స్టడీగా కొనసాగించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం…

3 రోజుల్లో 2.14 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా మిగిలిన 2 రోజుల్లో ఆల్ మోస్ట్ 30 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ హోల్డ్ ని చూపించింది. దాంతో ఓవరాల్ గా ఇప్పటి వరకు కలెక్షన్స్ తో…

సినిమా 2.44 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరుని చూపించింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా ఇలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి…

ఆల్ మోస్ట్ రన్ ఎండ్ టైంకి 2.5 కోట్ల రేంజ్ కలెక్షన్స్ తో పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఉండగా కొన్ని పెద్ద సినిమాల క్రేజీ రీ రిలీజ్ లతో పోల్చినా ఈ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here