Home న్యూస్ దేవర రాయలసీమ ఫైనల్ బిజినెస్….టాక్ వస్తే రికార్డుల జాతర ఖాయం!

దేవర రాయలసీమ ఫైనల్ బిజినెస్….టాక్ వస్తే రికార్డుల జాతర ఖాయం!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కి తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ బెస్ట్ ఫాలోయింగ్ ఉంది, అన్ని ఏరియాలకు మించి ఎన్టీఆర్ సినిమాలకు రాయలసీమ లో క్రేజ్ మరో లెవల్ లో ఉంటుంది, ఎన్టీఆర్ నటించిన లాస్ట్ మూవీ అరవింద సమేత(Aravindha Sametha) సినిమా డే 1 సాధించిన రికార్డ్ షేర్ ఇప్పటికీ రీజనల్ మూవీస్ లో…

బిగ్గెస్ట్ రికార్డును నమోదు చేసి అలాగే టాప్ లో ఉండటం విశేషం. ఇలాంటి టైంలో బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా వారం లోనే ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా…

మీద అన్ని చోట్లా హైప్ సాలిడ్ గానే ఉండగా రాయలసీమ లో సోలో హీరోగా ఎన్టీఆర్ నుండి ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా కి ఇక్కడ ఫైనల్ గా బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది..

ఎన్టీఆర్ ప్రీవియస్ సోలో మూవీ అయిన అరవింద సమేత 14 కోట్ల బిజినెస్ ను అందుకోగా తర్వాత చేసిన బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ 37 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ వస్తున్న దేవర మూవీకి…

ఫైనల్ గా 22 కోట్ల రేంజ్ లో రేటు ఫిక్స్ అయ్యింది…సినిమా ఇక్కడ ఓపెనింగ్ డేనే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇక టాక్ డీసెంట్ గా వస్తే ఈ బిజినెస్ ను రికవరీ చేయడం పెద్ద కష్టమేమి కాదు, అదే టాక్ యునానిమస్ లెవల్ లో ఉంటే ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోత మరో లెవల్ లో ఉండటం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here