పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ఇతర చోట్ల కూడా కుమ్మేసే ఫాలోయింగ్ ను బాక్స్ ఆఫీస్ రికార్డులను సొంతం చేసుకుంటూ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో…
మాస్ భీభత్సం సృష్టించగా తెలుగు రాష్ట్రలలో సినిమా జానర్ వలన కొన్ని చోట్ల ఇబ్బందులు పడినా ఒవరల్ గా అల్టిమేట్ లాభాలనే సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…కానీ సీడెడ్ ఏరియాలో వాల్యూ బిజినెస్ ను పూర్తిగా అందుకోలేక పోయింది…
టోటల్ రన్ లో 21.80 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా సినిమా జానర్ దృశ్యా ఊరమాస్ ఏరియాలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది, ఈ సినిమా కన్నా ముందు చేసిన మాస్ మూవీ సలార్ టోటల్ రన్ లో ఇక్కడ… 22.75 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా…
ఆ సినిమాతో పోల్చితే కేవలం కోటి లోపు డిఫరెన్స్ మాత్రమే ఉండటం ఇక్కడ ప్రభాస్ స్టార్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక సలార్ కన్నా ముందు చేసిన ఆదిపురుష్ ఇక్కడ టోటల్ రన్ లో 10.78 కోట్ల షేర్ ని అందుకోగా రాదే శ్యామ్ మూవీ 7.46 కోట్ల షేర్ ని అందుకుంది…
ఆ సినిమా కన్నా ముందు చేసిన సాహో మూవీ 11.82 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా టోటల్ గా లాస్ట్ 5 సినిమాల సీడెడ్ ఏరియా టోటల్ షేర్ 74.62 కోట్ల మార్క్ ని అందుకోగా ప్రభాస్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు సీడెడ్ ఏరియాలో…
యావరేజ్ గా ఒక్కో సినిమా కి ఇక్కడ షేర్ 14.92 కోట్ల రేంజ్ దాకా ఉండటం ప్రభాస్ మాస్ పవర్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక ప్రభాస్ అప్ కమింగ్ మూవీస్ కూడా ఎక్స్ లెంట్ గానే ఉండటంతో రాయలసీమలో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.