Home న్యూస్ AP లో దేవరకి సాలిడ్ టికెట్ హైక్స్….ఇక ఓపెనింగ్స్ లో రికార్డులు ఖాయం!

AP లో దేవరకి సాలిడ్ టికెట్ హైక్స్….ఇక ఓపెనింగ్స్ లో రికార్డులు ఖాయం!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో వస్తున్న సెన్సేషనల్ మూవీ దేవర(Devara Part 1) ఆడియన్స్ ముందుకు మరి కొన్ని రోజుల్లో గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా బిజినెస్ పరంగా రిలీజ్ పరంగా కూడా…

సినిమా మాస్ రచ్చ చేస్తూ ఉండగా వాటికి అడ్వాంటేజ్ గా ఇప్పుడు సినిమాకి తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్స్ స్పెషల్ షోల అడ్వాంటేజ్ లు ఇలా అన్నీ కలిసి రాబోతున్నాయి. నైజాంలో రీసెంట్ టైంలో అన్ని సినిమాలకు మంచి టికెట్ హైక్స్ అలాగే స్పెషల్ షోలు…

సొంతం అయినా కూడా ఆంధ్రలో మాత్రం కొత్త ప్రభుత్వం వచ్చే వరకు భారీ టికెట్ హైక్స్ లాంటివి సొంతం అవ్వలేదు, రీసెంట్ గా కల్కి మూవీ కి మంచి టికెట్ హైక్స్ సొంతం అవ్వగా ఇప్పుడు దేవర సినిమాకి కూడా ఎక్స్ లెంట్ టికెట్ హైక్స్ సొంతం అయ్యాయి…

ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద సింగిల్ స్క్రీన్స్ లో బాల్కనీకి నార్మల్ రేట్స్ మీద 110 వరకు హైక్ సొంతం అవ్వగా కింద సీట్స్ కి 60 వరకు హైక్స్ GST తో కలిపి పెంచారు…ఇక మల్టిప్లెక్స్ లలో సినిమా కి నార్మల్ టికెట్ రేట్స్ మీద ఏకంగా 135 వరకు టికెట్ రేట్స్ ను పెంచారు…

ఈ రేట్స్ 2 వారాల పాటు కొనసాగబోతూ ఉండగా వీటికి తోడూ మొదటి రోజు ముందు 12 గంటల రాత్రి నుండే స్పెషల్ షోలు వేసుకునే ఛాన్స్ ను అలాగే రోజుకి 5 షోలు వేసుకునే ఛాన్స్ లు కూడా ఇచ్చింది. ఈ రేంజ్ లో అడ్వాంటేజ్ ను సొంతం చేసుకున్న దేవర సినిమా కి…

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కావాల్సింది అల్లా ఒక్క పాజిటివ్ టాక్ అనే చెప్పాలి. సోలో బిగ్ రిలీజ్ టికెట్ హైక్స్ , దసరా వరకు ఫ్రీ రన్ పాజిటివ్ టాక్ వచ్చి సొంతం అయితే ఇక కలెక్షన్స్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here