Home న్యూస్ నైజాంలో నాని లాస్ట్ 3 మూవీస్ కలెక్షన్స్….ఎపిక్ ఫామ్ ఇది!!

నైజాంలో నాని లాస్ట్ 3 మూవీస్ కలెక్షన్స్….ఎపిక్ ఫామ్ ఇది!!

0

టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో సూపర్ ఫామ్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుని ఓవరాల్ గా హాట్రిక్ విజయాలతో ప్రస్తుతం కెరీర్ బెస్ట్ పీక్ ఫామ్ లో మాస్ రచ్చ చేస్తున్నాడు…

ఈ క్రమంలో తన రీసెంట్ మూవీస్ వరల్డ్ వైడ్ గ్రాస్ లెక్క 3 సినిమాలకు గాను 285 కోట్ల మార్క్ ని అందుకుని మీడియం రేంజ్ హీరోలలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతూ ఉండగా మరో పక్క తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా నైజాం ఏరియాలో ఎక్స్ లెంట్ ఫామ్ తో…

దూసుకు పోతున్న నాని డిఫెరెంట్ జానర్ మూవీస్ తో కూడా కుమ్మేస్తూ ఉండటం విశేషం…లాస్ట్ ఇయర్ మొదట్లో ఊరమాస్ మూవీ దసరాతో కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని నైజాంలో 25.96 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న నాని…

Saripodhaa Sanivaaram Movie 23 Days Total WW Collections!

ఇయర్ ఎండ్ లో హాయ్ నాన్న లాంటి అల్ట్రా క్లాస్ మూవీ తో కూడా కుమ్మేసి 12.80 కోట్ల షేర్ తో బిజినెస్ ను రికవరీ చేసి మంచి లాభాలను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు నాని నటించిన సరిపోదా శనివారం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా…

రీసెంట్ గా నైజాంలో 15 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి బిజినెస్ మీద డీసెంట్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. ఓవరాల్ గా నాని నటించిన లాస్ట్ 3 మూవీస్ నైజాం టోటల్ షేర్ లెక్క 53.8 కోట్ల రేంజ్ లో ఉండటం తన ఫామ్ ఏ రేంజ్ లో ఉంది అన్నదానికి నిదర్శనం…

తెలుగు రాష్ట్రాలలో మీడియం రేంజ్ హీరోల్లో స్టేబుల్ అండ్ గుడ్ మార్కెట్ ను సొంతం చేసుకున్న నాని, డిఫెరెంట్ జానర్ మూవీస్ తో కూడా రచ్చ చేస్తున్నాడు, ఇక నాని అప్ కమింగ్ మూవీస్ కూడా ప్రామిసింగ్ గానే ఉండగా వాటితో ఇంకా ఎలాంటి జోరు చూపిస్తాడో చూడాలి.

Saripodhaa Sanivaaram Movie 22 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here