Home న్యూస్ డే10 మత్తువదలరా2….డే 18 గోట్ కలెక్షన్స్….కుమ్ముతున్నాయిగా 2 సినిమాలు!!

డే10 మత్తువదలరా2….డే 18 గోట్ కలెక్షన్స్….కుమ్ముతున్నాయిగా 2 సినిమాలు!!

0

మూడో వారంలో కూడా జోరు చూపెడుతూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా అలాగే రెండో వీక్ లో ఎంటర్ అయ్యి మంచి జోరుని చూపెడుతూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మత్తు వదలరా2(Mathu Vadalara2) సినిమాలు….

ఈ ఆదివారం రోజున మంచి జోరుని చూపెడుతూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి….తెలుగు రాష్ట్రాల్లో విజయ్ గోట్ మూవీ కంప్లీట్ గా డౌన్ అయిపోయినా తమిళనాడులో అలాగే ఓవర్సీస్ లో ఇప్పటికీ మంచి జోరుని చూపెడుతూ దూసుకు పోతుంది….

ఇక మత్తు వదలరా2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజుతో పోల్చితే 10వ రోజు సండే అడ్వాంటేజ్ తో మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

Mathu Vadalara2 8 Days Total WW Collections!

ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 1.3 కోట్లకు పైగానే షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక విజయ్ గోట్ మూవీ 18వ రోజులో తమిళనాడులో ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ ఉండగా…

ఈ రోజు అక్కడ 4.5-5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం మించి పోయే ఛాన్స్ కూడా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని దాటేసి సూపర్ హిట్ దిశగా వెళుతున్న సినిమా 450 కోట్ల మార్క్ ని…

లాంగ్ రన్ లో అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా రెండు సినిమాలు ఈ సండే రోజున మంచి జోరుని చూపించగా తమిళ్ లో గోట్ తెలుగు రాష్ట్రాలలో మత్తువదలరా2 లు దుమ్ము లేపాయి. ఇక 2 సినిమాలు ఈ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటాయో చూడాలి.

The Greatest Of All Time 17 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here