టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కి తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ లో మాస్ ఫాలోయింగ్ ఉంది, ఇక్కడ తో పాటు పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమా వస్తుంది అంటే కన్నడ లో రచ్చ మరో రేంజ్ లో ఉంటుంది. రీసెంట్ టైంలో ఎన్టీఆర్ క్రేజ్ కన్నడలో మరింతగా పెరిగింది కూడా…
ఇలాంటి టైంలో ఎన్టీఆర్ నుండి సోలో హీరోగా ఆల్ మోస్ట్ 6 ఏళ్ల తర్వాత వస్తున్న మూవీ అయిన దేవర(Devara) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు… ఆల్ రెడీ ఓవర్సీస్ ప్రీ బుకింగ్స్ తో మాస్ రచ్చ చేసిన ఎన్టీఆర్…
ఇప్పుడు పక్క రాష్ట్రం కర్ణాటకలో మాస్ రచ్చ చేస్తూ తన మాస్ పవర్ ని చూపెడుతున్నాడు.. సినిమా కర్ణాటక అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ చేయగా మొదటి రోజుకి గాను రిమార్కబుల్ ప్రీ బుకింగ్స్ తో సినిమా ఊరమాస్ రచ్చ చేసి సంచలనం సృష్టించింది…
బుకింగ్స్ ఓపెన్ చేసిన గంటల టైంకే తొలిరోజు బుకింగ్స్ గ్రాస్ ఒక్క బెంగళూరు లోనే 2 కోట్లకు పైగా జరిగింది…ఇక ఇక టోటల్ గా కర్ణాటకాలో ఓపెన్ చేసిన సెంటర్స్ బుకింగ్స్ అన్నీ కలిపి ఆల్ మోస్ట్ 2.5 కోట్ల రేంజ్ కి దగ్గర అయ్యే లెవల్ లో బుకింగ్స్ ను సొంతం చేసుకుని దేవర మూవీ…
మీద జనాల్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్ధం అయ్యేలా చేసింది ఇప్పుడు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన చోట్ల బుకింగ్స్ కూడా త్వరలోనే ఓపెన్ కాబోతూ ఉండగా అన్ని చోట్లా ఇదే రేంజ్ లో మాస్ రచ్చ చేసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉంది, అన్నీ అనుకున్నట్లు జరిగితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి ఇప్పుడు.