Home న్యూస్ దేవర 1st రికార్డ్ ఔట్….ఎన్టీఆర్ పేరిట ఏకంగా ఇండియన్ రికార్డ్!

దేవర 1st రికార్డ్ ఔట్….ఎన్టీఆర్ పేరిట ఏకంగా ఇండియన్ రికార్డ్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ రాంపెజ్ ను చూపించదానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివల కాంబోలో తెరకెక్కుతున్న దేవర(Devara Part 1) మాస్ రచ్చ చేస్తూ శుక్రవారం వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ అన్ని చోట్లా ఓ రేంజ్ లో కుమ్మేస్తుంది…

కాగా ఇప్పుడు సినిమా పేరిట ఎన్టీఆర్ పేరిట ఫస్ట్ రికార్డ్ ఔట్ అయింది. దాంతో పాటు ఏకంగా ఇండియన్ రికార్డ్ కూడా నమోదు అవ్వడం విశేషం….నార్త్ అమెరికాలో ఇండియన్ హీరోలలో ఎవ్వరూ నమోదు చేయని రికార్డ్ ను ఇప్పుడు ఎన్టీఆర్ నమోదు చేసి సంచలనం సృష్టించాడు….

నార్త్ ఆమెరికాలో ఇండియన్ హీరోల పరంగా ప్రీమియర్స్ కి గాను జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ లో 2 మిలియన్స్ కి పైగా గ్రాస్ ను అందుకున్న వాళ్ళే చాలా తక్కువ కాగా మొదటి సారి ఆర్ ఆర్ ఆర్ మూవీకి గాను రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ 2 మిలియన్ ప్రీ సేల్స్ ను అందుకుని…

సమంగా రికార్డ్ కొట్టారు….ఇప్పుడు దేవర సినిమా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ 2 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి సంచలనం సృష్టించగా….బాక్ టు బాక్ 2 సినిమాలతో నార్త్ అమెరికా ప్రీమియర్స్ కి గాను 2 మిలియన్ కి పైగా గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న…

మొట్ట మొదటి ఇండియన్ హీరోగా ఎన్టీఆర్ ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు నమోదు చేసి సంచలనం సృష్టించాడు….RRR మల్టీస్టారర్ అవ్వడంతో రికార్డ్ ఇద్దరు హీరోలకు సమంగా ఉంటుంది, రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీతో ఈ రికార్డ్ కొడితే ఎన్టీఆర్ ని సమం చేసే అవకాశం ఉంటుంది. ఇక దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here