Home న్యూస్ ఇన్ని స్పెషల్ షోలు ఏంటి సామి….చుక్కలు చూయిస్తున్న టైగర్!

ఇన్ని స్పెషల్ షోలు ఏంటి సామి….చుక్కలు చూయిస్తున్న టైగర్!

0

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ దేవర పార్ట్ 1(Devara Part 1) భారీ క్రేజ్ నడుమ శుక్రవారం రిలీజ్ కానుండగా సినిమా మీద ఆల్ రెడీ అంచనాలు మరో లెవల్ లో ఉండగా, బిజినెస్ పరంగా ఆల్ రెడీ మాస్ రచ్చ చేసిన ఈ సినిమా ఇప్పుడు…

ఓపెనింగ్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతుంది, సినిమాకి రీసెంట్ టైంలో ఏ సినిమాకి సొంతం అవ్వని విధంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ టికెట్ హైక్స్ సొంతం అయ్యాయి…దానికి తోడూ సినిమా కి మిడ్ నైట్ షోల నుండే గ్రాండ్ రిలీజ్ అలాగే…

రోజుకి 5 షోల అడ్వాంటేజ్ కూడా లభించగా నైజాంలో సైతం మొదటి రోజు భారీ టికెట్ హైక్స్ అండ్ ఎక్స్ ట్రా షోల అడ్వాంటేజ్ లు లభించగా ఆంధ్రలో మిడ్ నైట్ షోల బుకింగ్స్ మరో లెవల్ లో రాంపెజ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా టోటల్ గా ఆంధ్ర ప్రదేశ్ లో..

Devara Part 1 Pre Release Business Details!!

ఇప్పటి వరకు 320 కి పైగా స్పెషల్ షోలు పడబోతున్నాయని సమాచారం. డిమాండ్ ను బట్టి ఈ నంబర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఎంతైనా ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 80% టికెట్స్ అన్నీ కూడా ఈ షోలవి ఆల్ రెడీ సొల్ద్ ఔట్ అయిపోవడం ఎన్టీఆర్ క్రేజ్ పవర్ కి నిదర్శనం…

మిగిలిన చోట్ల కూడా బుకింగ్స్ యమ స్పీడ్ గా సాగుతూ ఉండటంతో ఓవరాల్ గా స్పెషల్ షోలు, ఎక్స్ ట్రా షో తో పాటు భారీ టికెట్ హైక్స్ అడ్వాంటేజ్ తో సినిమా మొదటి రోజు ఆంధ్రలో ఊహకందని రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.

ఇక సీడెడ్ లో అయితే బుకింగ్స్ ట్రెండ్ మరో లెవల్ లో ఉండగా అక్కడ ఓపెనింగ్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డే 1 కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమాకి ఆడియన్స్ నుండి డీసెంట్ టాక్ వస్తే ఇక దసరా వరకు ఎన్టీఆర్ మాస్ జాతర చూపించడం ఖాయం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here