Home న్యూస్ దేవర @ 7250….ఇక చూసుకోండి రికార్డులు ఖాయం!

దేవర @ 7250….ఇక చూసుకోండి రికార్డులు ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) మూవీ వరల్డ్ వైడ్ గా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా, అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా మాస్ రచ్చ చేస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా కూడా…

గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది ఇప్పుడు…సినిమా ముందుగా నైజాం ఏరియాలో ఆల్ మోస్ట్ 380-400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. ఇక సినిమా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో సెన్సేషనల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా…

ఓవరాల్ గా అక్కడ 850 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది సినిమా…ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ 80-85% వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా 1250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న దేవర మూవీ ఇక హిందీకి వచ్చే సరికి ఓవరాల్ గా ఇప్పుడు…

1700-1800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, కర్ణాటక లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న సినిమా తమిళ్ అండ్ కేరళలో మాత్రం లిమిటెడ్ షోలే ఓపెన్ అవ్వగా ఓవరాల్ గా 500 వరకు థియేటర్స్ లో ఈ చోట్ల రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది.

దాంతో ఇండియాలో ఓవరాల్ గా ఇప్పుడు 3600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా ఇక నార్త్ అమెరికాలో రికార్డ్ లెవల్ లో రిలీజ్ కానున్న సినిమా యుకే యూరప్ ఏరియాల్లో, ఆస్ట్రేలియా న్యూజిలాండ్ గల్ఫ్ ఏరియాల్లో ఎక్స్ లెంట్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా…

టోటల్ ఓవర్సీస్ థియేటర్స్ కౌంట్ 3350-3650 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది…దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 7100-7250 వరకు థియేటర్స్ కొంచం అటూ ఇటూగా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. టాలీవుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ కానున్న దేవర ఇక ఓపెనింగ్స్ పరంగా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here