Home న్యూస్ ఇక్కడ ఇలా అయితే కష్టమే….జోరు పెంచాల్సిందే…ఏమవుతుందో ఇక!!

ఇక్కడ ఇలా అయితే కష్టమే….జోరు పెంచాల్సిందే…ఏమవుతుందో ఇక!!

0

భారీ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవర(Devara Part 1) మీద అంచనాలు భారీ లెవల్ లో ఉండగా…సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక మరియు ఓవర్సీస్ లో సెన్సేషనల్ బుకింగ్స్ తో రచ్చ చేస్తూ ఉండగా…

తమిళ్ అండ్ కేరళలో సినిమా నుండి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకం తక్కువగానే ఉండగా హిందీలో మాత్రం ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తర్వాత ఎన్టీఆర్ కి మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని అందరూ అనుకున్నారు కానీ.. దేవర ప్రస్తుతం ఉన్న పరిస్థితి…

హిందీలో పెద్దగా అంచనాలను అందుకునే రేంజ్ లో అయితే లేవనే చెప్పాలి…సినిమా హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అవ్వగా ఓపెన్ అయిన సెంటర్స్ లో బుకింగ్స్ ట్రెండ్ నిరాశ కలిగించే విధంగానే ఉందని చెప్పాలి…దాంతో సినిమా కి హిందీ లో మౌత్ టాక్ ఇప్పుడు…

చాలా ముఖ్యంగా మారింది అని చెప్పాలి. టీం కూడా మిగిలిన చోట్లతో పోల్చితే హిందీలో కొంచం ప్రమోషన్స్ డీసెంట్ గానే చేయగా ఓపెనింగ్స్ విషయంలో కొన్ని మాస్ సెంటర్స్ లో బుకింగ్స్ బాగానే ఉన్నా కూడా ఓవరాల్ హిందీ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే…

ఓపెనింగ్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపే రేంజ్ లో ఉండే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సినిమాకి పాజిటివ్ టాక్ కనుక వస్తే 5-6 కోట్ల రేంజ్ లో డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…కానీ టీం సినిమా హిందీ పెర్ఫార్మెన్స్ మీద ఆశలు ఎక్కువగా పెట్టుకోగా…

ప్రజెంట్ ఓపెనింగ్స్ పరిస్థితి మాత్రం హిందీలో అనుకున్న రేంజ్ లో లేదు కానీ పోటి లేకుండా సినిమా రిలీజ్ అవుతూ ఉండటం, ఒకవేళ పాజిటివ్ టాక్ కనుక వస్తే ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా లాంగ్ రన్ లో జోరు చూపించే అవకాశం ఉందని అంచనా…మరి ఎంతవరకు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిందీలో జోరు అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here