Home న్యూస్ దేవర రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

దేవర రివ్యూ…..ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0
JR NTR Devara Part 1 Review and Rating
JR NTR Devara Part 1 Review and Rating

ఎప్పుడెప్పుడా అని యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తున్న సినిమా దేవర(Devara Part 1 Review Rating) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది….సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా మరి సినిమా ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంది, ఏ రేంజ్ లో మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే….సముద్ర తీరంలో నాలుగు ఊర్లు, ఆ ఊర్లకి పెద్ద దేవర….ఒకప్పుడు సముద్రంను కాపాడే వాళ్ళు తర్వాత టైంలో సముద్రంలో దొంగతనాలు చేస్తూ ఉండటంతో ఆ పని చేయొద్దు అనుకుంటాడు దేవర…దాంతో తనకి శత్రువులు తయారు అవుతారు….తన కొడుకు వర భయస్తుడు….

విలన్ అయిన సైఫ్ అలీ ఖాన్ ఎలా దేవర అడ్డు తొలగించుకోవాలని ట్రై చేశాడు….దేవర సముద్రంలో కనిపించకుండా ఎందుకు వెళ్ళాడు…భయస్తుడైన వర భయాన్ని వీడాడ లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. ఇక హీరోయిన్ రోల్స్ ఇతర క్యారెక్టర్స్ గురించి సినిమా చూడాల్సిందే…

కొరటాల శివ(Koratala Siva)ఈ కథ చాలా కొత్తగా ఉంటుంది అన్నారు, కానీ ఇది ఒక రొటీన్ మాస్ మూవీ టెంప్లెట్ మాత్రమే…కానీ చెప్పిన విధానం రొటీన్ మూవీస్ కి భిన్నంగా ఉంటుంది….అది సినిమా చూస్తె అర్ధం అవుతుంది, కానీ రొటీన్ కథ అవ్వడంతో చాలా వరకు తర్వాత సీన్ ఏమవుతుంది అన్నది ఆడియన్స్ గెస్ చేస్తారు….

Devara Part 1 Pre Release Business Details!!

దాంతో కథ పరంగా డైరెక్షన్ పరంగా కొరటాల ఫుల్ కంబ్యాక్ ఇవ్వలేక పోయాడు అనిపించింది…అదే టైంలో ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్, డైలాగ్స్…. మాస్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేసి ఇతర తప్పులను కూడా మరిచిపోయేలా చేసి చివరి వరకు థియేటర్స్ లో కూర్చోబెట్టాడు…

దేవర రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో….వర రోల్ అంత అండర్ ప్లే చేసినా ఆడియన్స్ ఒప్పుకునేలా పెర్ఫార్మ్ చేశాడు ఎన్టీఆర్….ఇక సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా చేశాడు కానీ ఆ రోల్ కానీ తన పెర్ఫార్మెన్స్ కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు….ఇక హీరోయిన్ జాన్వి కపూర్ రోల్ చిన్నదే అయినా ఏమాత్రం ఇంపాక్ట్ లేదు…మిగిలిన రోల్స్ కూడా పెద్దగా సీన్స్ పడలేదు…

ఇక సినిమాకి సెకెండ్ హీరో అనిరుద్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్….వీక్ గా అనిపించిన సీన్స్ ను కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేశాడు…ఇంటర్వెల్ ఎపిసోడ్ సీన్ చాలా బాగా వచ్చింది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు బాగా మెప్పించింది…సెకెండ్ ఆఫ్ ఆ పేస్ తగ్గినట్లు అనిపించినా సెకెండ్ ఆఫ్ రన్ టైం తక్కువ అవ్వడంతో పెద్దగా ఇబ్బంది పెట్టలేదు…

సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు, కొన్ని సీన్స్ అద్బుతంగా నిర్మించి విజువల్ గా ఎక్స్ లెంట్ గా అనిపించినా కొన్ని చోట్ల ఇంకా బెటర్ గా ఉండాల్సింది అనిపించింది. ఇక మొత్తం మీద దేవర మూవీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో….కొరటాల శివ మునుపటి రేంజ్ ని పూర్తిగా అందుకోలేదు కానీ…

ఫ్యాన్స్ కోరుకునే అంశాలను బాగానే మ్యానేజ్ చేసినా, కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సీన్స్ విషయంలో రెగ్యులర్ ఫార్మాట్ నే ఫాలో అయినట్లు అనిపించింది. ఇక ఎండ్ సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి అన్నారు కానీ పర్వాలేదు అనిపించేలా ఉంటాయి….

ఓవరాల్ గా మరీ భీభత్సం కాదు కానీ ఎన్టీఆర్ కోసం ఈజీగా ఒకసారి చూసేలా ఉంటుంది దేవర మూవీ….కొరటాల శివ, ఎన్టీఆర్ ల హైప్ ను గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే ఫస్టాఫ్ ఆ హై ను కొంచం మ్యాచ్ చేసినా సెకెండ్ ఆఫ్ కొంచం డ్రాగ్ అయ్యి క్లైమాక్స్ అంచనాలను పూర్తిగా అందుకోదు…కాబట్టి నార్మల్ మూవీ అనుకుని వెళితే ఆడియన్స్ ఓవరాల్ గా పర్వాలేదు, బాగుంది అనిపించేలా ముగుస్తుంది దేవర మూవీ…ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here