బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) అన్ని చోట్లా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో కుమ్మేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు అంచనాలను అన్నీ కూడా మించి పోయే రేంజ్ లో భీభత్సం సృష్టించాయి… నైజాం ఏరియాలో సినిమా మొదటి రోజు ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది… తొలి రోజు కలెక్షన్స్ పరంగా ఇక్కడ…
ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించడం విశేషం…రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే దేవర మూవీకి టికెట్ హైక్స్ సాలిడ్ గా ఉండటం, మిడ్ నైట్ షోలు ఓ రేంజ్ లో పడటం, కొన్ని చోట్ల హైర్స్ ఇలా ఫుల్ అడ్వాంటేజ్ లు లభించడంతో అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడక పోయినా కూడా మినిమమ్ 80-85% రేంజ్ ఆక్యుపెన్సీని ఓవరాల్ గా ….
మెయిన్ టైన్ చేస్తూ వెళ్ళిన సినిమా మొదటి రోజు సెన్సేషనల్ నంబర్స్ ను పోస్ట్ చేసింది…ఓవరాల్ గా మొదటి రోజు సినిమా నైజాం ఏరియాకి వచ్చే సరికి సినిమా ఏకంగా 22.64 కోట్ల మమ్మోత్ షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది…ఈ రేంజ్ లో మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ఊచకోత కోసిన దేవర మూవీ మిగిలిన చోట్ల కూడా…
ఓ రేంజ్ లో కుమ్మేసింది…ఇక నైజాంలో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 44 కోట్ల దాకా ఉండగా మొదటి రోజే సినిమా అందులో సగం రికవరీ చేసి ఊహకందని ఊచకోత కోసింది. ఇక వీకెండ్ తో పాటు తర్వాత అక్టోబర్ 2 న నేషనల్ హాలిడే ఉండటం, తర్వాత దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా ఉండటం లాంటివి ఇప్పుడు సినిమా కి…
మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ అడ్వాంటేజ్ లతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఇదే రేంజ్ లో జోరు కొనసాగిస్తే ఊహకందని కలెక్షన్స్ ని నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. నైజాంలో లాంగ్ రన్ లో సినిమా బిజినెస్ ను ఎన్ని రోజుల్లో అందుకుంటుందో చూడాలి ఇప్పుడు…