Home న్యూస్ సీడెడ్ లో చరిత్ర చిరిగిపోయింది….దేవర 1st డే ఎపిక్ మమ్మోత్ రికార్డ్!!

సీడెడ్ లో చరిత్ర చిరిగిపోయింది….దేవర 1st డే ఎపిక్ మమ్మోత్ రికార్డ్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఒకరు…6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా సినిమా ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసింది. అందులో రాయలసీమ ఏరియాలో చరిత్రలో నిలిచి పోయే రేంజ్ లో…

కలెక్షన్స్ తో శివ తాండవం ఆడాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్….ఈ ఏరియాలో ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన అరవింద సమేత 2018 టైంలో నెలకొల్పిన వర్త్ షేర్ రికార్డ్ ఇప్పటికీ రీజనల్ మూవీస్ లో రికార్డ్ హోల్డర్ గా ఉంది…ఇక ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ తో రామ్ చరణ్(Ram Charan) తో కలిసి ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత ఎన్టీఆర్ నుండి…

వచ్చిన సోలో మూవీ దేవర ఎపిక్ కలెక్షన్స్ తో డబుల్ డిజిట్ షేర్ మార్క్ ని ఇక్కడ అందుకున్న మూవీగా ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది… మొదటి రోజు ఇక్కడ సినిమా ఓవరాల్ గా 10.37 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సొంతం చేసుకోగా, ఇందులో మిడ్ నైట్ షోల కలెక్షన్స్, స్పెషల్ షోలు, అలాగే కొన్ని చోట్ల హైర్స్ కలెక్షన్స్ యాడ్ అయ్యాయి. హైర్స్ లెక్కలు పూర్తిగా…

రివీల్ కాలేదు కానీ 1.95 కోట్ల దాకా హైర్స్ లెక్కలు యాడ్ అయినట్లు ట్రేడ్ లెక్కల అంచనా…అవి క్లియర్ గా రివీల్ అయిన తర్వాత మరోసారి అప్ డేట్ చేస్తాం. ఓవరాల్ గా…ట్రేడ్ లెక్కల్లో ఎస్టిమేట్ హైర్స్ లెక్కలు 1.95 కోట్ల దాకా ఉంటాయని అంచనా..ఫుల్ డీటైల్స్ ఇంకా తెలియాల్సి ఉండగా ఓవరాల్ గా ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత మళ్ళీ అప్ డేట్ చేస్తాం…

మొదటి రోజు ఓవరాల్ గా సినిమా ఊహకందని కలెక్షన్స్ తో రాయలసీమ లో రికార్డుల జాతర సృష్టించింది…ఈ షేర్ రికార్డ్ ను అప్ కమింగ్ టాప్ స్టార్స్ మూవీస్ అందుకోవాలి అంటే, ఊహకందని బజ్ అండ్ క్రేజ్ చాలా అవసరం అనే చెప్పాలి. ఈ లోపు మళ్ళీ ఎన్టీఆర్ కుదిరితే వార్2 తో అలాగే ప్రశాంత్ నీల్ తో చేసే ఊరమాస్ మూవీతో మళ్ళీ బ్రేక్ చేసినా ఆశ్యర్యపోనవసరం ఉండదు…

Devara Part 1 Pre Release Business Details!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here