Home న్యూస్ దేవర 1st డే తెలుగు స్టేట్స్ టోటల్ కలెక్షన్స్….ఎన్టీఆర్ తాండవం…మాస్ తాండవం ఇది!!

దేవర 1st డే తెలుగు స్టేట్స్ టోటల్ కలెక్షన్స్….ఎన్టీఆర్ తాండవం…మాస్ తాండవం ఇది!!

0

6 ఏళ్ల తర్వాత సోలో మూవీతో వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ తాండవం ఆడాడు…ఒక్క ఏరియా అని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్లా ఎన్టీఆర్ సినిమా కలెక్షన్స్ జాతర సృష్టించింది….అంచనాలను అన్నీ కూడా మించి పోయింది. ఎన్టీఆర్ కొరటాల శివల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie) అన్ని చోట్లా అంచనాలను అన్నీ కూడా మించి పోయింది…

సినిమా కి మొదటి రోజు ముందు నైట్ షోలు భారీ లెవల్ లో పడటం, తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ రిలీజ్, భారీ టికెట్ హైక్స్, ఎక్స్ ట్రా షోలు ఇలా అనేక అడ్వాంటేజ్ లు కలిసి రావడంతో అనుకున్న అంచనాలను అన్నీ కూడా సినిమా మొదటి రోజు మించి పోయింది…. తెలుగు రాష్ట్రాల్లో నైజాం, సీడెడ్ ఏరియాల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న దేవర…

కోస్టల్ ఆంధ్ర లో కూడా రిమార్కబుల్ ట్రెండ్ ను రోజంతా చూపించింది…దానికి తోడు హైర్స్ అలాగే SGs, Mgs లు కూడా కలిసి రావడంతో ఓవరాల్ గా డే 1 నంబర్స్ అంచనాలను మించాయి. 48-50 కోట్ల రేంజ్ లో కుదిరితే అంతకుమించి వస్తాయి అనుకుంటే అంచనాలను అన్నీ మించి పోయిన సినిమా మొదటి రోజు ఏకంగా….

60 కోట్ల షేర్ మార్క్ ని కూడా దాటేసి భీభత్సం సృష్టించింది….ఒకసారి మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ ను గమనిస్తే….
Devara 1st Day Telugu States Collections Report
👉Nizam: 22.64Cr
👉Ceeded: 10.37CR
👉UA: 6.45Cr
👉East: 4.73Cr
👉West: 4.20Cr
👉Guntur: 7.24Cr
👉Krishna: 3.53Cr
👉Nellore: 2.49Cr
AP-TG Total:- 61.65CR (80.10CR~ Gross)

మొత్తం మీద సినిమాకి ఏ ఏరియాలో ఎన్ని హైర్స్ లాంటివి యాడ్ అయ్యాయి అన్న వివరాలను మరో ఆర్టికల్ లో క్లియర్ గా అప్ డేట్ చేస్తాం…ఓవరాల్ గా మొదటి రోజు మాస్ ఊచకోత కోసిన సినిమా బిజినెస్ లో సగానికి పైగా రికవరీని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుంది. ఇదే జోరుని వీకెండ్ వరకు కొనసాగిస్తే బ్రేక్ ఈవెన్ ను కూడా అందుకునే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Part 1 Pre Release Business Details!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here