Home న్యూస్ దేవర 2nd డే కలెక్షన్స్….ఇదేం మాస్ హోల్డ్ రా బాబు!!

దేవర 2nd డే కలెక్షన్స్….ఇదేం మాస్ హోల్డ్ రా బాబు!!

0
Jr NTR Devera Part 1 2nd Day Box Office Collections
Jr NTR Devera Part 1 2nd Day Box Office Collections

మొదటి రోజు అంచనాలను మించి కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1 Movie 2nd Day Box Office Collections) రెండో రోజులో అడుగు పెట్టగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించి అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గానే హోల్డ్ ని చూపించింది…

మొదటి రోజుతో పోల్చితే రెండో రోజు డ్రాప్స్ ఉన్నప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలలో అలాగే మిగిలిన చోట్ల మంచి హోల్డ్ తో దుమ్ము లేపుతుంది….తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ చూస్తూ ఉంటే 15-16 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా హిందీలో రెండో రోజు ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేస్తూ ఉండగా 10 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని రెండో రోజు సినిమా సొంతం చేసుకునే అవకాశం ఉంది…

Devara Part 1 Pre Release Business Details!!

ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక కర్ణాటకలో రెండో రోజు 5 కోట్లకు పైగానే గ్రాస్ ను క్రాస్ చేసే అవకాశం ఉంది. ఇక తమిళ్ అండ్ కేరళలో కలిపి 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఓవర్సీస్ లో రెండో రోజు మంచి హోల్డ్ ని చూపెడుతూ రచ్చ లేపుతున్న దేవర మూవీ ఇప్పుడు రెండో రోజు వరల్డ్ వైడ్ గా ఓవరాల్ గా…26-28 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఇక అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి ఈ కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఓవరాల్ గా రెండో రోజున సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ ఉండటం విశేషం కాగా ఇక అఫీషియల్ 2 డేస్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here