Home న్యూస్ అక్షరాలా 210 కోట్లు….ఇది యంగ్ టైగర్ మాస్ జాతర!!

అక్షరాలా 210 కోట్లు….ఇది యంగ్ టైగర్ మాస్ జాతర!!

0
Jr NTR Devara 2 Days Gross Collections Update
Jr NTR Devara 2 Days Gross Collections Update

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి మాస్ రచ్చ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 2 Days Total Gross Collections) ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది. తెలుగు రాష్ట్రాల్లో 82 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న దేవర మూవీ…

వరల్డ్ వైడ్ గా 157 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది….ఇక రెండో రోజు సినిమా ఉన్నంతలో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపించడం విశేషం అని చెప్పాలి. సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద…

26-28 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉండగా, ఫైనల్ లెక్కలు బాగుంటే 30 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ పెరిగే అవకాశం ఉంది…ఇక సినిమా హిందీలో ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపెడుతూ ఉండగా మొత్తం మీద 12 కోట్లకు పైగా…

గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక కర్ణాటకలో 5-6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, తమిళ్, కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా టోటల్ గా 2వ రోజున ఇండియా లో….

46-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో మంచి జోరుని చూపించిన సినిమా ఇప్పుడు 2వ రోజు వరల్డ్ వైడ్ గా 52-53 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…

ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా…ఓవరాల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 110 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో 210 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరగవచ్చు. ఇక టోటల్ గా 2 రోజులకు గాను సినిమా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here