Home న్యూస్ 5th డే దేవర ఓపెనింగ్స్….ఈ రోజు మళ్ళీ రచ్చ ఖాయమా!!

5th డే దేవర ఓపెనింగ్స్….ఈ రోజు మళ్ళీ రచ్చ ఖాయమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న తర్వాత వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టగా 4వ రోజు ఉన్నంతలో మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ ని చూపించింది ఇప్పుడు.

ఇక 5వ రోజు మరోసారి వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా ఆల్ మోస్ట్ 4వ రోజుకి సిమిలర్ గా ట్రెండ్ అవుతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల టైంకి సినిమా గ్రోత్ ని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

దాంతో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా 5వ రోజు మరోసారి 4వ రోజు లెవల్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 5.5-6 కోట్ల రేంజ్ దాకా షేర్ ని అందుకునే అవకాశం ఉంది…

Devara Movie 3 Days Total World Wide Collections!!

ఇక హిందీలో మరోసారి 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే ఇక్కడ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉండగా ఇక సినిమా కర్ణాటకలో మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో ఈ రోజు ట్యూస్ డే ఆఫర్ ఉంటుంది కాబట్టి…

ఆ అడ్వాంటేజ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజు వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 9-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండవచ్చు. ఇక డే ఎండ్ వరకు ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Devara Movie 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here