బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో మాస్ రచ్చ చేసిన తర్వాత నాలుగో రోజు వర్కింగ్ డే లో ఉన్నంతలో మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara 5th Day Box Office Collections) సినిమా ఇప్పుడు 5వ రోజు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా నార్మల్ గా అయితే…
వర్కింగ్ డేస్ లో ప్రతీ రోజు కలెక్షన్స్ లో 15-20% రేంజ్ లో డ్రాప్స్ కనిపించడం కామన్….కానీ దేవర మూవీ కి 6వ రోజు అక్టోబర్ 2 నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో 5వ రోజు ఈవినింగ్ అండ్ నైట్ షోలకు మంచి జోరుని చూపెడుతూ ఆల్ మోస్ట్ 4వ రోజు లెవల్ లో….
కొన్ని చోట్ల 4వ రోజు కన్నా బెటర్ గా కొన్ని చోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ టికెట్ సేల్స్ లో గ్రోత్ ని చూపెడుతూ ఉండగా ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే…
ఈ అంచనాలను కూడా సినిమా మించే అవకాశం ఉంది. ఇక హిందీలో కూడా సినిమా ఈ రోజు కొంచం గ్రోత్ ని చూపిస్తూ ఉండగా 4.5-5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో మరోసారి మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండగా..
తమిళ్ అండ్ కేరళలో మాత్రం డ్రాప్స్ కంటిన్యూ అవుతూ ఉండగా ఓవర్సీస్ లో మరోసారి పర్వాలేదు అనిపించేలా జోరు చూపిస్తూ ఉండటంతో సినిమా 5వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే మరోసారి 10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా ఈ అంచనాలను మించిపోతే ఇక 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఉంది. ఇక టోటల్ గా 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి ఇక…