Home న్యూస్ రాయలసీమ లో దేవర @ 20 కోట్లు….యంగ్ టైగర్ ఎపిక్ రికార్డ్ కొట్టాడు!!

రాయలసీమ లో దేవర @ 20 కోట్లు….యంగ్ టైగర్ ఎపిక్ రికార్డ్ కొట్టాడు!!

1

తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మంచి హోల్డ్ ని వర్కింగ్ డేస్ లో కూడా చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కి తిరుగు లేని క్రేజ్ ఉన్న రాయలసీమ ఏరియాలో ఎక్స్ లెంట్ హోల్డ్ తో దూసుకు పోతూ ఉంది.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్న తర్వాత రెండో రోజు నుండి కలెక్షన్స్ పరంగా ఎక్స్ లెంట్ హోల్డ్ నే కొనసాగించగా వర్కింగ్ డేస్ లో కొంచం డ్రాప్ అయినా కూడా స్టడీగా నే హోల్డ్ ని చూపిస్తూ ఇప్పుడు ఓవరాల్ గా…

Devara Movie 4 Days Total World Wide Collections!!

5 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో 20 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని మాస్ ఊచకోత కోసింది…కాగా టాలీవుడ్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ ని రాయలసీమ లో సొంతం చేసుకుని ఊహకందని భీభత్సం సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…

ఆర్ ఆర్ ఆర్ మూవీ రెండో రోజు సాధించిన కలెక్షన్స్ తోనే 20 కోట్లకు పైగా షేర్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు దేవర మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపెడుతూ 5 రోజులు పూర్తి అయ్యే టైంకి 20 కోట్ల షేర్ మార్క్ ని ఇక్కడ అందుకుని సంచలనం సృష్టించింది. 

ఇక సినిమా కి ఇప్పుడు 6వ రోజు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడం, దాంతో పాటు తర్వాత వీకెండ్ అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్ కూడా ఉండటంతో లాంగ్ రన్ లో మరిన్ని అద్బుతాలు ఇక్కడ నమోదు చేసే అవకాశం సినిమాకి ఎంతైనా ఉంది. ఈ అడ్వాంటేజ్ లతో సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here