Home న్యూస్ డే 6 హౌస్ ఫుల్స్ జాతర…దేవర భీభత్సం!

డే 6 హౌస్ ఫుల్స్ జాతర…దేవర భీభత్సం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) వరల్డ్ వైడ్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండగా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర….మొదటి వారం వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత…

6వ రోజు సినిమాకి గాంధీ జయంతి నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించింది..ఈ అవకాశాన్ని ఎక్స్ లెంట్ గా వాడుకుంటున్న సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా వీకెండ్ రేంజ్ లో బ్యాటింగ్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపెడుతుంది..

Devara Movie 5 Days Total World Wide Collections!!

తెలుగు రాష్ట్రాల్లో క్లాస్ అండ్ మాస్ సెంటర్స్ లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీతో దుమ్ము లేపుతున్న సినిమాకి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు ఈ రోజు పడ్డాయి…టికెట్ సేల్స్ లో కూడా డే 5తో పోల్చితే ఎక్స్ లెంట్ బుకింగ్స్ ట్రెండ్ కనిపిస్తూ ఉండగా…

కలెక్షన్స్ పరంగా కూడా ఈ రోజు సినిమా అంచనాలను మించి జోరు చూపించబోతుంది…సినిమాకి హైదరాబాదు లో ఎక్స్ ట్రా షోలు, థియేటర్స్ ను యాడ్ చేయగా…కోస్టల్ ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో ఊర్లలో ఉన్న థియేటర్స్ లో కూడా ఈ రోజు…

ఎక్స్ ట్రా థియేటర్స్ ని కూడా యాడ్ చేస్తూ ఉండటం విశేషం ….దాంతో ఓవరాల్ గా సినిమా బిగ్ హాలిడే ను ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండటంతో, ఇదే జోరుని ఈ వీకెండ్ లో తిరిగి చూపించే అవకాశం ఉండగా తర్వాత దసరా సెలవుల్లో మరింత రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక 6వ రోజు ఓవరాల్ గా సినిమా ఏ రేంజ్ లో అంచనాలను మించుతుందో చూడాలి.

Devara Movie 3 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here