బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి మొదటి రోజు ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా మొదటి ఆటకే మిక్సుడ్ టాక్ రావడం, సోషల్ మీడియా మొత్తం నెగటివ్ టాక్ తో నిండిపోవడంతో ఇక సినిమా తేరుకోవడం కష్టమే అనుకున్నా కూడా మొదటి రోజే ఆల్ మోస్ట్ 50% రికవరీని సొంతం చేసుకోగా….
తర్వాత మిక్సుడ్ టాక్ ఉన్నా కూడా కలెక్షన్స్ స్టడీగానే సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించిన సినిమా ఇప్పుడు 6వ రోజు నేషనల్ హాలిడే హెల్ప్ తో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్…
97% రేంజ్ లో రికవరీని ఓవరాల్ గా అందుకున్న సినిమా 6వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసి లాభాల లోకి ఎంటర్ అయ్యి సంచలనం సృష్టించింది. మిక్సుడ్ టాక్ తోనే సినిమా వరల్డ్ వైడ్ గా కేవలం 6 రోజుల్లోనే…
బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేయడం మామూలు విషయం కాదు…184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను 6 రోజుల్లో ఓవరాల్ గా అందుకున్న సినిమా ఏరియాల వారిగా కొన్ని చోట్ల ఇంకా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాల్సి ఉండగా లాంగ్ రన్ లో వీకెండ్స్, అలాగే దసరా సెలవుల అడ్వాంటేజ్…
ఉన్న నేపధ్యంలో ఇదే రేంజ్ లో హోల్డ్ ని కొనసాగిస్తే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…..ఓవరాల్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన మాస్ పవర్ తో మిక్సుడ్ టాక్ తో కూడా సినిమాను సేఫ్ జోన్ లోకి ఎంటర్ అయ్యేలా చేశాడు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి ఇప్పుడు.