డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ని ఎంచుకుంటూ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకు పోతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు(Sree Vishnu) ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఓం భీమ్ బుష్(Om Bheem Bush) మూవీతో పర్వాలేదు అనిపించేలా హిట్ కొట్టగా, ఇప్పుడు రాజ రాజ చోర కాంబోలో చేసిన లేటెస్ట్ మూవీ శ్వాగ్(Swag Movie Telugu Review) తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది….
ఇక సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…ముందుగా కథ పాయింట్ కి వస్తే 15వ దశకంలో పురుషుల మీద ఆదిపత్యం ప్రదర్శిస్తూ దూసుకు పోతున్న రీతు వర్మ హద్దులు దాటిపోవడంతో మగవాళ్ళ కోసం పోరాడాలని సిద్ధం అయిన శ్రీ విష్ణు శ్వాగణిక వంశాన్ని అభివృద్ధి చేసి ఆదిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తాడు…అలా తరాలు మారగా…
ఆ వంశం నుండి వచ్చిన తరతరాల ఆస్తి కోసం హీరో హీరోయిన్స్ ఏం చేశారు, తర్వాత ఏం జరిగింది అన్నది మిగిలిన కథ…ముందుగా పెర్ఫార్మెన్స్ పరంగా శ్రీ విష్ణు వివిధ గెటప్స్ లో దుమ్ము లేపాడు, తన నటన ఈ ఇయర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు…
ఇక హీరోయిన్స్ అందరూ కూడా డబుల్ రోల్స్ లో అదరగొట్టేశారు….ఇక మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా సంగీతం ఓకే అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని సీన్స్ కి ఎక్స్ లెంట్ గా ఆకట్టుకుంది… ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు కొంచం కన్ఫ్యూజింగ్ గా ఉన్నా కూడా…
ఇంటర్వెల్ ఎపిసోడ్ మాత్రం బాగా వర్కౌట్ అయ్యి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…సెకెండ్ ఆఫ్ లో సినిమా సీరియస్ టోన్ తో సాగి చాలా తక్కువ చోట్ల కామెడీ పడగా కంప్లీట్ గా సీరియస్ గానే సాగుతూ సెంటిమెంట్ డోస్ పెరిగిపోయింది…అది అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి…
ఓవరాల్ గా డైరెక్టర్ హసిత్ గోలి ఎంచుకున్న డిఫికల్ట్ సబ్జెక్ట్ ను పార్టు పార్టులుగా పర్వాలేదు అనిపించేలా తెరకెక్కించినా కూడా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే వలన అప్ అండ్ డౌన్స్ తో సినిమా సాగి పర్వాలేదు అనిపించేలా ముగుస్తుంది….ఓవరాల్ గా చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ అయిన శ్వాగ్ మూవీని…
డైరెక్టర్ మరీ సీరియస్ టోన్ తో కాకుండా కామెడీ డోస్ మరింత పెంచి సెకెండ్ ఆఫ్ లో డ్రాగ్ అవ్వకుండా చూసుకుని ఉంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేది సినిమా…అయినా కూడా పార్టు పార్టులుగా శ్వాగ్ మూవీ పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు కానీ కొంచం ఓపిక అవసరం….ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్……