తెలుగు సినిమా కి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక మరియు ఓవర్సీస్ లు పెద్ద మార్కెట్ లు, ఈ మధ్యనే కొన్ని సినిమాలకు, కొందరు స్టార్స్ కి బాలీవుడ్ లో మార్కెట్ స్టార్ట్ అయింది…కానీ ఎప్పటి నుండో మన పక్కనే ఉండే తమిళ్ ఇండస్ట్రీ లో మాత్రం మన సినిమాలకు మార్కెట్ పెద్దగా ఏమి ఏర్పడలేదు అనే చెప్పాలి. కొన్ని సినిమాలకు డీసెంట్ బిజినెస్ జరిగినా కూడా….
ఎక్కువ శాతం సినిమాలకు మాత్రం అక్కడ నిరాశ కలిగించే రిజల్ట్ సొంతం అయ్యింది. RRR తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) అక్కడ గ్రాండ్ గానే రిలీజ్ చేశారు…
సినిమాను మొత్తం మీద 6 కోట్ల రేంజ్ లో రేటుకి అమ్మారు…సినిమా కోసం ఎన్టీఆర్ తమిళ్ లో డబ్బింగ్ కూడా చెప్పాడు, ప్రమోషన్స్ కోసం తమిళనాడుకి వెళ్ళాడు, ఇంటర్వ్యూలు సైతం ఇచ్చాడు…కానీ ఫలితం ఏమి కనిపించలేదు…. తమిళ్ నుండి వచ్చే ప్రతీ డబ్బింగ్ మూవీని…
టాలీవుడ్ వాళ్ళు ఎగబడి చూస్తారు కానీ మన టాప్ స్టార్స్ సినిమాలను సైతం వాళ్ళు చాలా చాలా తక్కువ సందర్బాలలోనే పట్టించుకుంటారు. దేవర మూవీ ఇప్పటి వరకు తమిళనాడులో కేవలం 4 కోట్ల లోపే షేర్ ని తెలుగు మరియు తమిళ్ డబ్ వర్షన్ లు కలిపి సొంతం చేసుకుంది…
అందులో కూడా తెలుగు వర్షన్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి…మొత్తం మీద రన్ కూడా ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది….మిగిలిన చోట్ల మంచి పెర్ఫార్మెన్స్ నే చూపించిన దేవర మూవీ తమిళ్ లో మాత్రం కలెక్షన్స్ పరంగా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది ఇప్పుడు.
ఇన్నేసి భాషల్లో డబ్బింగ్ చెప్పిన ఎన్టీఆర్ కి అన్ని చోట్లా మంచి పేరుతో పాటు వసూళ్లు దక్కాయి, కానీ తమిళ్ లో తన డబ్బింగ్ కి మంచి పేరు వచ్చినా బాక్స్ ఆఫీస్ ఫలితం మాత్రం నిరాశ పరిచింది. ఇక ఎన్టీఆర్ అప్ కమింగ్ మూవీస్ ఇక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తాయో చూడాలి. అదే టైంలో అప్ కమింగ్ తెలుగు పాన్ ఇండియా మూవీస్ ని తమిళ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కూడా చూడాలి ఇప్పుడు.