Home న్యూస్ దేవర 2nd వీక్ థియేటర్స్….ఎన్టీఆర్ ఊరమాస్ రచ్చ!

దేవర 2nd వీక్ థియేటర్స్….ఎన్టీఆర్ ఊరమాస్ రచ్చ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రెండో వారంలో అడుగు పెట్టి మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగిస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా మొదటి వారంలో సాలిడ్ గా థియేటర్స్ లో రన్ ని కొనసాగించి…

రెండో వారంలో అడుగు పెట్టగా రెండో వారంలో ఇప్పుడు ఎన్ని థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా, సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో 1250 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాంచగా రెండో వారానికి వచ్చే సరికి సినిమా నైజాంలో…

265 కి పైగా థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో ఓవరాల్ గా 550వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రెండో వారంలో 820 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం…

Devara Movie 8 Days Total World Wide Collections!!

ఇక హిందీలో సినిమా రెండో వీక్ లో 1000 స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండగా, కర్ణాటక, తమిళ్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 200 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తుంది. దాంతో టోటల్ గా ఇండియా లో సినిమా రెండో వీక్ లో 2000 కి పైగా థియేటర్స్ లో రన్ ను కొనసాగిస్తూ ఉండగా…

ఓవర్సీసిస్ లో కూడా భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా రెండో వీక్ లో 3000 కి పైగానే స్క్రీన్స్ లో పరుగును కొనసాగిస్తుంది. ఓవరాల్ గా రెండో వీకెండ్ లో కూడా సినిమా మంచి కలెక్షన్స్ తో పరుగును కొనసాగించడం ఖాయమని చెప్పాలి. తర్వాత ఎలాగూ దసరా సెలవులు కూడా ఉండటంతో జోరు కొనసాగే అవకాశం ఎంతైనా ఉంది.

Devara Movie 1st Week(7 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here