Home న్యూస్ దేవర: 114 కోట్ల టార్గెట్…10 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్…మాస్ జాతర!

దేవర: 114 కోట్ల టార్గెట్…10 డేస్ AP-TG టోటల్ కలెక్షన్స్…మాస్ జాతర!

0

ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న  యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara) మాస్ రాంపెజ్ ను చూపెడుతూ ఉండగా మొదటి వారంలో దుమ్ము లేపిన తర్వాత రెండో వీకెండ్ లో మరోసారి మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….

9వ రోజు ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపించిన తర్వాత 10వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 5 కోట్లు దాటేసి 5.5-6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకోగా…

సినిమా ఆ అంచనాలను సైతం మించి పోయిన దేవర ఓవరాల్ గా 10వ రోజు ఏకంగా 6.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని మాస్ భీభత్సం సృష్టించింది. మొత్తం మీద 10.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన సినిమా…

Devara Movie 10 Days Total World Wide Collections!!

ఇప్పుడు టోటల్ గా 10 రోజుల్లో టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Devara Movie 10 Days AP-TG Total Collections report(Inc GST)
👉Nizam: 54.48Cr
👉Ceeded: 25.48CR
👉UA: 14.74Cr
👉East: 8.85Cr
👉West: 7.01Cr
👉Guntur: 11.65Cr
👉Krishna: 7.92Cr
👉Nellore: 5.70Cr
AP-TG Total:- 135.83CR(193.55CR~ Gross)

మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల్లో 112.55 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా 114 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 21.8 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో మాస్ రచ్చ చేస్తుంది. ఇక సినిమా దసరా సెలవుల్లో ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

Devara Movie 4 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here