Home న్యూస్ అక్షరాలా 26 కోట్లు….సీడెడ్ రారాజు ఎన్టీఆర్!!

అక్షరాలా 26 కోట్లు….సీడెడ్ రారాజు ఎన్టీఆర్!!

0

తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara), అన్ని చోట్లా ఊరమాస్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా రిమార్కబుల్ కలెక్షన్స్ తో ఇప్పుడు లాంగ్ రన్ ను సైతం సొంతం చేసుకుంటూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కి…

తిరుగు లేని క్రేజ్ ఉన్న రాయలసీమ ఏరియాలో 6 ఏళ్ల క్రితం సోలో హీరోగా అరవింద సమేత(Aravindha Sametha) సినిమాతో బిగ్గెస్ట్ డే 1 వర్త్ షేర్ రికార్డ్ ను అందుకోగా 6 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఆ రికార్డ్ అలానే కొనసాగుతూ ఉంది. తర్వాత రామ్ చరణ్(Ram Charan) తో కలిసి చేసిన.

ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎపిక్ రికార్డులను ఇక్కడ నమోదు చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత చేసిన దేవర సినిమా ఓపెనింగ్ డే నుండే ఇక్కడ రికార్డుల జాతర సృష్టిస్తుంది…మొదటి రోజు నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో ఎపిక్ డే 1 కలెక్షన్స్ ని అందుకున్న దేవర…

Devara Movie 8 Days Total World Wide Collections!!

నాన్ స్టాప్ గా 6 రోజుల పాటు కోటికి తగ్గకుండా షేర్ ని ఇక్కడ అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఇక ఫాస్టెస్ట్ 20 కోట్ల షేర్ ని, ఫాస్టెస్ట్ 25 కోట్ల షేర్ మార్క్ ని ఇక్కడ నాన్ ఆర్ ఆర్ ఆర్ మూవీస్ లో నమోదు చేసిన ఎన్టీఆర్ దేవర…ఇప్పుడు 26 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది…

సీడెడ్ ఏరియాలో రెండు సార్లు 26 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఒకే ఒక్క తెలుగు హీరోగా ఎపిక్ రికార్డు ను నమోదు చేశాడు ఎన్టీఆర్…అది కూడా బాక్ టు బాక్ మూవీస్ తో ఇలా 26 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడం ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి…

అదే క్రమంలో ఇప్పుడు ఎక్స్ లెంట్ హోల్డ్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న దేవర ఈ దసరా వీకెండ్ వరకు ఇదే రేంజ్ లో జోరు కొనసాగిస్తే సినిమా 30 కోట్ల మార్క్ వైపు వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది…ఇక ఎన్టీఆర్ సీడెడ్ ఏరియాలో నమోదు చేసిన ఈ రికార్డ్ ను ఫ్యూచర్ లో వేరే హీరోలు ఎవరైనా అందుకుంటారో లేక ఎన్టీఆర్ మరోసారి తన అప్ కమింగ్ మూవీస్ తో ఈ రికార్డ్ ను కొడతాడో చూడాలి.

Devara Movie 10 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here